నేటి నుంచి పలు మార్పులు అమల్లోకి

ఎస్ బీఐ కస్టమర్లు తమ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటే కేవైసీ పొందడం తప్పనిసరి. ఇండియన్‌ బ్యాంక్‌ వినియోగదారులు ఏటీఎంల నుంచి రూ.2 వేల నోట్లు విత్‌డ్రా చేసుకోలేరు.

నేటి నుంచి పలు మార్పులు అమల్లోకి

Sbi

IFSC code of banks : దేశంలో ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధంగా నేటి నుంచి పలు నియమ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటిలో బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మార్పు, ఎస్బీఐ కస్టమర్లకు కేవైసీ తప్పనిసరి వంటివి ఉంటాయి.

ఎస్ బీఐ కస్టమర్లు తమ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటే కేవైసీ పొందడం తప్పనిసరి. ఇండియన్‌ బ్యాంక్‌ వినియోగదారులు ఏటీఎంల నుంచి రూ.2 వేల నోట్లు విత్‌డ్రా చేసుకోలేరు. అయితే వారు బ్యాంక్‌ కౌంటర్‌ నుంచి డైరెక్ట్‌గా వీటిని పొందే వీలుంటుంది.

SBI : జీరో బ్యాలెన్స్ కింద ఎస్ బీఐ రూ. 300 కోట్లు వసూలు

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ)లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకు విలీనమైన నేపథ్యంలో ఈ రెండు బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారనున్నాయి. ఇక నుంచి పాత కోడ్‌తో లావాదేవీలు చేయలేరు.

వీటితో పాటు ఈ నెల 10తో దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియనుండటంతో గ్యాస్‌, పెట్రోల్‌ రేట్లను సవరించే అవకాశం ఉందని ఆ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

New Toll Plaza Rules: టోల్ ప్లాజా దగ్గర 10 సెకన్లకు మించి వెయిట్ చేయాల్సి వస్తే నో ట్యాక్స్

టోల్‌ప్లాజాల నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌ కొనుగోలు చేయాలంటే వాహనదారులు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.