Cow Dung : ఆవు పేడ ఎత్తుకెళ్లిన దొంగలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

కాగా గోధన్ న్యాయ్ యోజన పథకంలో భాగంగా ప్రభుత్వం.. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం పేడను సేకరిస్తుంటుంది. గ్రామ ప్రజల ఆదాయాలు పెంచేందుకు ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

Cow Dung : ఆవు పేడ ఎత్తుకెళ్లిన దొంగలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Cow Dung

Cow Dung : ఛత్తీస్‌గఢ్ లో ఆవు పేడ దొంగలు పెరిగిపోయారు. తరచుగా ఆవు పేడ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం గోధన్ న్యాయ్ యోజన పథకం కింద కేజీ ఆవు పేడను రూ.2 కొంటుండటంతో దొంగల కన్ను పెడపై పడింది.

దీంతో పేడ కనిపిస్తే ఎత్తుకెళ్తున్నారు. అయితే తాజాగా 800 కేజీల ఆవు పేడను దొంగిలించారు గుర్తుతెలియని వ్యక్తులు దీనిపై ఆవుల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటన కోర్బా జిల్లాలోని ధురేనా గ్రామంలో చోటుచేసుకుంది.

కాగా గోధన్ న్యాయ్ యోజన పథకంలో భాగంగా ప్రభుత్వం.. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం పేడను సేకరిస్తుంటుంది. గ్రామ ప్రజల ఆదాయాలు పెంచేందుకు ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.