రూ.100 నోటు చెల్లదా ?, కేంద్రం మరో కీలక నిర్ణయం!

రూ.100 నోటు చెల్లదా ?, కేంద్రం మరో కీలక నిర్ణయం!

this-is-what-rbi-has-to-say-about-old-rs-100-notes1

old Rs 100 notes : పెద్ద నోట్లను రద్దు చేసి అందరికీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ..ఆర్బీఐ కీలక అధికారి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఏడాదిలో మరో షాకింగ్ నిర్ణయం దిశగా ఆర్బీఐ యోచిస్తోందని, మార్చి లేదా ఏప్రిల్ నాటికి చలామణిలో ఉన్న కొన్ని పాత కరెన్సీ నోట్లను విత్ డ్రా చేసుకొనే ఆలోచనలో ఉందని ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.మహేష్ శుక్రవారం వెల్లడించడం హాట్ టాపిక్ అయ్యింది.

జిల్లా పంచాయతీలోని మంగుళూరు, నేత్రావతి హాల్ లో జిల్లా లీడ్ బ్యాంకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి భద్రతా కమిటీ (DLSC), జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్ మెంట్ కమిటీ (DLMC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బి.మహేష్ మాట్లాడుతూ…రూ. 100, రూ. 10, రూ. 05 పాత కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకోనుందనే హింట్ ఇచ్చారు. రూ. 10 నాణెం ప్రవేశపెట్టి..15 సంవత్సరాలు అవుతున్నా..వ్యాపారవేత్తలు, వ్యాపారులు వాటిని తీసుకోవడానికి ఇష్టపడడం లేదన్నారు. నకిలీవని వారు అనుమానిస్తుండడంతో బ్యాంకులు, ఆర్బీఐకి సమస్యగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో…రూ. 10 నాణెంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, పాత నోట్లను మార్చుకొనేందుకు ఎంత సమయం ఇస్తుంది ? అనే దానిపై క్లారిటీ లేదన్నారు.

2016, నవంబర్ 08వ తేదీన రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తర్వాత..రూ. 2 వేల కరెన్సీ నోటుతో పాటు..రూ. 200 నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం 2019లో 100 రూపాయల కొత్త కరెన్సీ నోటును వినియోగంలోకి తీసుకొచ్చింది. 2019లో సెంట్రల్ బ్యాంకు రూ. 2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఇచ్చిన ఆర్టీఐ ఇచ్చిన సమాధానంలో ఆర్బీఐ వెల్లడించింది. త్వరలోనే ఈ నోటును రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది. దీనిని కేంద్రం, ఆర్బీఐ కొట్టివేశాయి.