కొన్ని నెలలుగా భార్యను బంధించిన భర్త..అక్కడే మల, మూత్రాలు..ఢిల్లీలో దారుణ ఘటన

  • Published By: madhu ,Published On : August 26, 2020 / 07:34 AM IST
కొన్ని నెలలుగా భార్యను బంధించిన భర్త..అక్కడే మల, మూత్రాలు..ఢిల్లీలో దారుణ ఘటన

ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలలుగా భార్యను ఓ రూంలో గొలుసులతో బంధించాడో ఓ భర్త. అక్కడే మల, మూత్రంలో జీవిస్తూ..ఉన్న ఆ మహిళ దుర్భరమైన జీవితం గడిపింది. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ ఆమెను రక్షించింది. మానసికంగా క్రుంగి పోయిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



ఢిల్లీలో త్రిలోక్ పురి ప్రాంతంలో ఓ ఇంట్లో మహిళ దయనీయ, దుర్భరమైన జీవితం గడుపుతోందని మహిళా పంచాయతీ టీంలోని ఓ వాలంటీర్ ఢిల్లీ మహిళా కమిషన్ కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతీ మాలివాల్ కు డీసీడబ్ల్యూ సభ్యులు ఫిర్దోస్ ఖాన్, కిరణ్ నేగీ వివరించారు.
https://10tv.in/inspiring-disabled-woman-seen-carrying-water-in-a-pot-viral-video/
వెంటనే వారందరూ ఆ మహిళ ఉంటున్న నివాసానికి వెళ్లారు. ఓ రూంలో మహిళ కాలికి ఇనుప గొలుసు, తాళం వేసి బంధించి ఉండడం గమనించారు. అక్కడే మలం, మూత్రం విసర్జన చేస్తుండడంతో భరించలేని దుర్వాసన నెలకొంది. ఆమె బట్టలు చిరిగిపోయి చిందరవందరంగా ఉన్నాయి.



11 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని గుర్తించారు. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త తనను దారుణంగా కొట్టేవాడని, గత ఆరు నెలల నుంచి గొలుసులతో బంధించి వేశాడని వాపోయింది. దీంతో ఆమె మానసికంగా క్రుంగిపోయింది. దర్యాప్తులో బాధిత భర్త..ఓ పిండిగిర్నీతో వ్యాపారం చేసేవాడని తేలింది.

తల్లిని తండ్రి కొట్టేవాడని పిల్లలు వెల్లడించారు. ఆమెను విడిపించి…చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కమిషన్ భావిస్తోంది.



తమకు మహిళా పంచాయతీ నుంచి ఫిర్యాదు వచ్చిందని, తాము అక్కడి వెళ్లగా..మహిళ పరిస్థితి చూసి చలించిపోయామని DCW Chief స్వాతి మలివాల్ వెల్లడించారు. తాము ఆమెను రక్షించామని, పునరావాసం కల్పించేందుకు అవసరమైన చికిత్స అందించేందుకు తాము కృషి చేస్తామన్నారు. అవమానవీయ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొనే విధంగా ప్రయత్నిస్తామన్నారు.