Train : పట్టాలపై ఆగిపోయిన రైలు.. కూలీలతో తోయించిన అధికారులు

సాంకేతిక లోపంతో పట్టాలపై ఆగిపోయిన రైలును కట్టపడి ముందుకు తోశారు కూలీలు.. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Train : పట్టాలపై ఆగిపోయిన రైలు.. కూలీలతో తోయించిన అధికారులు

Train

Train : రోడ్డుపై, కారు, బస్సు, లారీ లాంటి వాహనాలు ఆగిపోవడం తరచుగా చూస్తుంటాం. సిటీలో ఆగిపోతే వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందిస్తాం. అదే మారుమూల ప్రాంతాల్లో అయితే.. అక్కడ ఉన్న స్థానికుల సాయం తీసుకోని పక్కకు తీస్తారు. ఇవి సాధారణ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే రైలు పట్టాల మీద ఆగిపోవడం ఎప్పుడైనా చూస్తారా?.. ఒకవేళ ఆగితే వేరే ఇంజిన్ తగిలించి తీసుకెళ్లారు. కానీ ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో మాత్రం మనుషులే కష్టపడి ముందుకు తోస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని తిమర్నీ రైల్వే స్టేషన్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ స్టేషన్ భోపాల్ డివిజన్‌ పరిధిలోకి వస్తుంది. సరుకు రవాణా చేసే రైలు ఈ స్టేషన్ వద్దకు రాగానే సాంకేతిక లోపంతో ఆగిపోయింది. లోకోపైలెట్లు ఎంత ప్రయత్నించినా ఇంజిన్ స్టార్ట్ కాలేదు. అప్పటికే ఆ ట్రాక్ మీద ప్రయాణించాల్సిన రైళ్లు కొద్దీ దూరంలో వేచి ఉన్నాయి.

దీంతో రైల్వే అధికారులు అక్కడ ఉన్న 40 మంది కూలీల సాయంతో అతికష్టం మీద ఆ రైలును వేరే ట్రాక్ పైకి నెట్టించారు. రైలు పక్కకు పంపి ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఈ దృశ్యాలను అక్కడున్న ప్రయాణికులు తమ ఫోన్లలో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.