లారీ డ్రైవర్లు లుంగీ ధరిస్తే రూ.2వేలు ఫైన్

  • Published By: venkaiahnaidu ,Published On : September 9, 2019 / 04:30 AM IST
లారీ డ్రైవర్లు లుంగీ ధరిస్తే  రూ.2వేలు ఫైన్

లుంగీ ధరించి లారీ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా తప్పదంటోంది యూపీ సర్కార్.  ఇకపై డ్రెస్ కోడ్ పాటించని లారీ డ్రైవర్లకు జరిమానాలు విధించాలని యోగి సర్కారు నిర్ణయించింది. లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే రూ.2000 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు

కొత్త మోటారువాహనాల చట్టం అమలులోకి వచ్చిన కారణంగా వాణిజ్య వాహనాలు నడిపే డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని సర్కారు ఆదేశించింది. వాణిజ్య వాహనాలు, లారీలు నడిపే డ్రైవర్లు ఫుల్ సైజు ప్యాంటు షర్టు యూనిఫాంతోపాటు షూ తప్పనిసరిగా ధరించాలని కొత్త మోటారు వాహనాల చట్టం నిర్దేశించింది. 1939నుంచి మోటర్ వెహికల్ యాక్ట్ లో డ్రెస్ కోడ్ భాగంగా ఉండేదని,1989లో ఈ చట్టానికి చేసిన సవరణ ప్రకారం డ్రెస్ కోడ్ ను డ్రైవర్లు ఉల్లంఘిస్తే  500 రూపాయల జరిమానా ఉండేదని, ప్రస్తుత కొత్త చట్టం 2019 ఎంవీ యాక్ట్ లోని సెక్షన్ 179 ప్రకారం… డ్రైవర్లు డ్రెస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించి లుంగీ ధరించి డ్రైవింగ్ చేస్తే  2వేల రూపాయల జరిమానా విధిస్తున్నామని లక్నో ఏఎస్పీ(ట్రాఫిక్) పూర్ణెందు సింగ్ తెలిపారు. స్కూల్ వాహనాల డ్రైవర్లకు కూడా ఈ రూల్,పెనాల్టీ వర్తిస్తుందని ఆయన తెలిపారు.

సెంట్రల్ యోటర్ వాహనాల చట్టం… రాష్ట్రాలకు కొన్ని ట్రాఫిక్ సెఫ్టీ రూల్స్ రూపొందించేందుకు అధికారం ఇచ్చిందని,ఈ రూల్స్ అతిక్రమించివారిని వదిలిపెట్టమని  యూపీ అదనపు రవాణ శాఖ కమిషనర్ గంగాఫల్ చెప్పారు.