Funny Accident : నవ్వు తెప్పించే ప్రమాదం.. డ్రైవర్ లేచి పరిగెత్తాడు.

రోడ్డు ప్రమాదాలు సాధారణమే.. కొన్ని ప్రమాదాలు బాధ కలిస్తే.. మరికొన్ని ప్రమాదాలు మాత్రం నవ్వుతెప్పిస్తాయి. ఆలా నవ్వు తెప్పించే ప్రమాదమే తాజాగా జరిగింది.

Funny Accident : నవ్వు తెప్పించే ప్రమాదం.. డ్రైవర్ లేచి పరిగెత్తాడు.

Funny Accident

Funny Accident : రోడ్డు ప్రమాదాలు సాధారణమే.. కొన్ని ప్రమాదాలు బాధ కలిస్తే.. మరికొన్ని ప్రమాదాలు మాత్రం నవ్వుతెప్పిస్తాయి. ఆలా నవ్వు తెప్పించే ప్రమాదమే తాజాగా జరిగింది. హెవీలోడ్ వేసుకోని అతివేగంతో వెళ్తున్న లారీ ఒకటి ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం దానికదే చేసుకుంది.

Read More :  Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది ఏపీ కూలీలు మృతి!

వేగంగా వెళ్తున్న సమయంలో మలుపు రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా స్టీరింగ్ తిప్పాడు. దీంతో క్యాబిన్ తో సహా మొత్తం ఊడి కిందపడిపోయింది. ఆ తర్వాత లారీ దూసుకెళ్లింది.. ప్రమాదం సమయంలోనే డ్రైవర్ కిందపడిపోయారు.

Read More :  Bike Accident: సూపర్ బైక్ క్రాష్‌లో ప్రాణాలు కాపాడేదెంటో తెలుసా..

డ్రైవర్ సీటులో ఎవరు లేకపోయిన లారీ పరుగులు తీసింది. ఇక లారీని పట్టుకునేందుకు డ్రైవర్ దానివెంట పరుగులు తీశాడు. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. నెటిజ‌న్లు.. ఆ వీడియోను చూసి వెరైటీ కామెంట్లు చేస్తున్నారు.

శరీరాన్ని త్యాగం చేసి ఆత్మ బ‌య‌టికి వెళ్లిపోయింది.. అంటూ ఓ యూజ‌ర్ కామెంట్ చేశాడు. అయితే.. ఈ వీడియోను చూసి.. అయ్యో.. అనే వాళ్ల క‌న్నా.. న‌వ్వుకున్న వాళ్లే ఎక్కువ‌.