TTD Chairman YV Subba Reddy: భూమి పూజకు రండి.. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

TTD Chairman YV Subba Reddy: భూమి పూజకు రండి.. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్
ad

TTD Chairman YV Subba Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈనెల 21న మహారాష్ట్రలోని నవీ ముంబైలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మాణం చేయనున్న స్వామివారి ఆలయానికి భూమి పూజ నిర్వహించడం జరుగుతుందని, భూమి పూజ కార్యక్రమానికి రావాలని సీఎం, డిప్యూటీ సీఎంలను టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కోరారు.

TTD: 18న టీటీడీ వాచీల ఈ-వేలం

అనంతరం వేద పండితులు షిండే, ఫడ్నవీస్ లకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్‌, ఈఓలు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నవీ ముంబై సమీపంలోని ఉల్వేలో 10 ఎకరాల భూమిని కేటాయించింది. మహారాష్ట్రలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆ స్థలాన్ని టీటీడీకి కేటాయించారు. అయితే ఇటీవల అధికారం మారిన తర్వాత టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, TTD EO ఏ.వీ. ధర్మారెడ్డిలు మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను కలిసి ఆలయ భూమిపూజకు ఆహ్వానించారు.

TTD Hundi Income : శ్రీవారి హుండీ ఆదాయంలో మరో రికార్డు..జులై నెలలో రూ.139.45 కోట్ల విరాళాలు

ఆహ్వానాన్ని స్వీకరించిన తర్వాత ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ ఇద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 21వ తేదీన నవీ ముంబైలో జరగనున్న భూమి పూజకు హాజరవుతామని తెలిపారు. ఇదిలాఉంటే ఆలయ నిర్మాణాకి అయ్యే ఖర్చును రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా భరించేందుకు ముందుకొచ్చారు. ఆలయ నిర్మాణానికి రూ. 60 నుండి రూ. 70 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.