AK 47s found: ఈడీ దాడుల్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం.. భారత జవాన్లకు చెందినవిగా గుర్తింపు

అక్రమ మైనింగ్ విషయంలో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులకు ఒక నిందితుడి నివాసంలో రెండు ఏకే-47 రైఫిళ్లు లభించాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి రెండూ భారత జవాన్లకు చెందినవని పోలీసులు తెలిపారు.

AK 47s found: ఈడీ దాడుల్లో ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం.. భారత జవాన్లకు చెందినవిగా గుర్తింపు

AK 47s found: అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఝార్ఖండ్‌లో ఈడీ జరిపిన దాడుల్లో రెండు ఏకే-47 రైఫిళ్లు బయటపడ్డాయి. అవి రెండూ భారత జవాన్లకు చెందినవి కావడం గమనార్హం. ఝార్ఖండ్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు సంబంధించి హేమంత్ సోరెన్ సన్నిహితుడైన పంకజ్ మిశ్రాను ఇటీవల ఈడీ ప్రశ్నించింది.

Liger Pre Release Business : లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 100 కోట్లు రావాల్సిందే.. విజయ్ కెరీర్లోనే హైయ్యెస్ట్..

ఈ సందర్భంగా అతడు వెల్లడించిన వివరాల ఆధారంగా బిహార్, ఝార్ఖండ్, తమిళనాడు, ఢీల్లీలోని పలు చోట్ల నిందితుల ఇండ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దీనిలో ఝార్ఖండ్‌లోని ప్రేమ్ ప్రకాష్ అనే వ్యక్తికి సంబంధించిన ఒక ఇంట్లో బుధవారం.. రెండు ఏకే-47 రైఫిళ్లు లభించాయి. ఈ సమాచారాన్ని ఈడీ అధికారులు స్థానిక పోలీసులకు అందించారు. ఈ రెండు రైఫిళ్లు వేర్వేరు అల్మరాల్లో దాచి ఉంచారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి భారత జవాన్లకు సంబంధించినవని పోలీసులు తెలిపారు. అయితే, ఇంతకుమించి సమాచారాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

Odisha school: స్కూలు ఫీజు చెల్లించలేదని విద్యార్థుల్ని లైబ్రరీలో బంధించిన యాజమాన్యం.. తల్లిదండ్రుల ఆగ్రహం

ప్రస్తుతం రైఫిళ్లు లభించిన ప్రకాష్, అతడి అనుచరులు పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక అక్రమ మైనింగ్‌కు సంబంధించి అధికారులు ఇప్పటికే రూ.13.32 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.