భారతా వాతావరణ శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్న కేరళ… ప్రైవేట్ గా అంచనా

  • Published By: dharani ,Published On : June 24, 2020 / 10:48 AM IST
భారతా వాతావరణ శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్న కేరళ… ప్రైవేట్ గా అంచనా

కేరళ రాష్ట్రంలోని వాతావరణ హెచ్చరికల జారీ సేవలను మెరుగుపరచడానికి తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రైవేట్ వాతావరణ సంస్ధలకు నిధులను ఇవ్వనునట్లు తెలిపింది. కేరళ ప్రభుత్వ వివత్తు నిర్వహణ విభాగం జారీ చేసిన ఆదేశాల ప్రకారం స్కైమెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎర్త్ నెట్ వర్క్స్, ఐబిఎం వెదర్ కంపెనీలకు 95 లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు ది హిందూ ప్రతికకు తెలిపింది. రాష్ట్రంలోని వాతావరణ హెచ్చరికలు, సూచనలు తెలియజేస్తాయిని తెలిపింది. 

కేరళలో 2019 లో సంభవించిన వరదలు వల్ల కేరళలోని వాతావరణ పరిస్దితులపై తీవ్ర ఆందోళనలు గురి చేసింది. అందుకే ఈ సేవలు ఒక సంవత్సరం పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉంచనున్నట్లు తెలిపింది. భారత వాతావరణ శాఖ (IMD)అందించే సేవలపై అసంతృప్తిగా ఉన్నట్లు కేరళ ప్రభుత్వం పేర్కొంది. బుతుపనాల ప్రారంభానికి ముందు 15 కొత్త ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని IMD హామీ ఇచ్చింది. కానీ ఆ పని చేయలేదు. 

అంతేకాకుండా రాష్ట్రంలో ఎటువంటి నెట్ వర్క్ లను ఏర్పాటు చేయలేదు, ప్రధాన అవసరాలు తీర్చలేదు అని రాష్ట్ర విపత్తు నిర్వహణ సామర్ధ్యాలకు ఆటంకం కలిగించిందని నివేదకలో తెలిపింది. అందుకే ప్రైవేట్ వాతావరణ సంస్థల సేవలను ఉపయోగించుకోవాలని వచ్చిందని లేఖలో పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు డాప్లర్ వెదర్ రాడార్లు ఉన్నాయి. అవి వాతావరణ సూచనలను అందిస్తుందని IMD అధికారి తెలిపారు.

స్కైమెట్ సీఈఓ జతిన్ సింగ్ మాట్లాడుతూ, ఇప్పటికే తమ సంస్ధ ‘కేరళ వర్షం’అనే పేరుతో మెుబైల్ యాప్ ను తయారు చేసిందని తెలిపారు. ఇది రాష్ట్రంలోని 100 వాతావరణ కేంద్రాల నుంచి 15 రోజుల ముందస్తు వాతావరణ సూచనలు అందిస్తుందని సింగ్ తెలిపారు.

Read: క్వారంటైన్ సమయంలో హెల్దీ పుడ్ తీసుకోవటం లేదంటున్న డైట్ నిపుణులు