Union Bank : నిరుద్యోగులకు శుభవార్త, 347 ఉద్యోగాలు భర్తీ
బ్యాంకులో ఉద్యోగం సాధించాలని గోల్ గా పెట్టుకున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్..

Union Bank Of India Recruitment 2021
Union Bank of India recruitment 2021 : బ్యాంకులో ఉద్యోగం సాధించాలని గోల్ గా పెట్టుకున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 347 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 12న ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 3 దరఖాస్తులకు చివరి తేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.unionbankofindia.co.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం 347 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
సీనియర్ మేనేజర్(రిస్క్)-60 పోస్టులు
మేనేజర్(రిస్క్)-60 పోస్టులు
మేనేజర్(సివిల్ ఇంజనీర్)-7 పోస్టులు
మేనేజర్ (ఆర్కిటెక్ట్) – 7 పోస్టులు
మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజర్) – 2 పోస్టులు
మేనేజర్ (ప్రింటింగ్ టెక్నాలజిస్ట్) – 1 పోస్ట్
మేనేజర్ (Forex) – 50 పోస్టులు
మేనేజర్ (ఛార్టెడ్ అకౌంటెంట్) – 14 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ ఆఫీసర్) – 26 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (Forex) – 120 పోస్టులు
New Born Babies: కరోనా సమయంలో పుట్టిన పిల్లల్లో IQ బాగా తక్కువ
అర్హతల వివరాలు..
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు. సీనియర్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే అభ్యర్థుల వయస్సు 30-40 ఏళ్లు, మేనేజర్ ఉద్యోగాలకు 25-35 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 20-30 ఏళ్లు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ..
ఆన్ లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక.
అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ unionbankofindia.co.in లో అప్లయ్ చేయాలి. రూ. 850 పరీక్ష ఫీజు. ఎస్సీ, ఎస్టీ, PWBD అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 12, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 3, 2021
అప్లయ్ చేసుకునే ప్రాసెస్..
స్టెప్ 1. బ్యాంకు అఫీషియల్ వెబ్ సైట్ unionbankofindia.co.in కు వెళ్లాలి
స్టెప్ 2: వెబ్ సైట్ కిందకు వెళ్లి రిక్రూట్ మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి
స్టెప్ 3: Click here to view current Recruitment లింక్ పై క్లిక్ చేయాలి
స్టెప్ 4 : అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.