Giriraj Singh : ముస్లింలను అప్పుడే పాకిస్థాన్‌కు పంపించేసి ఉండాల్సింది : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

ఇది 70 ఏళ్ల క్రితమే మన పెద్దలు ఆ పని ఉండాల్సింది. దేశ విభజన సమయంలోనే వాళ్లను పాక్‌కు పంపించి ఉంటే మనం ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు అంటూ కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Giriraj Singh : ముస్లింలను అప్పుడే పాకిస్థాన్‌కు పంపించేసి ఉండాల్సింది : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

Union minister Giriraj Singh

Union minister Giriraj Singh : బీహార్‌లోని బేగుసరాయ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలోనే ముస్లింలను పాకిస్థాన్‌‌ను పంపించి ఉండాల్సిందని అంటూ వ్యాఖ్యలు చేశారు. గిరిరాజ్ సింగ్ రెండేళ్ల క్రితం కూడా ఇలాగే వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని ఇచ్చిన హామీని ప్రముఖ ముస్లిం నేత మౌలానా అర్షద్ మదానీ సమర్థించారు.

దీంతో మైలానా అర్షద్ పై గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ..సోమవారం ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గిరిరాజ్ సింగ్ మరోసారి ముస్లింలను దేశ విభజన సమయంలోనే పాకిస్థాన్ పంపించేసి ఉంటే ఇప్పుడు ఓవైసీ, మదానీలాంటి వాళ్లతో డీల్ చేయాల్సి వచ్చేది కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది 70 ఏళ్ల క్రితమే చేసి ఉండాల్సింది అని అన్నారు. దేశ విభజన సమయంలోనే ముస్లింలను పాక్‌కు పంపించి ఉంటే మనం ఇప్పుడు ఓవైసీ, మదానీ లాంటి వాళ్లతో డీల్ చేయాల్సి వచ్చేది కాదు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌, పిఎఫ్‌ఐలపై ఉక్కుపాదం మోపుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటువంటి వివాదాస్పద హామీ ఇచ్చినా కాంగ్రస్ కర్ణాటకలో అఖండ విజయం సాధించింది. కాంగ్రెస్ ఇచ్చిన బజరంగ్ దళ్‌పై నిషేధం విధించే విషయాన్ని మౌలానా అర్షద్ మదానీ సమర్థించారు.

కాగా గిరిరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందిస్తు..మంత్రి పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది సరికాదని సూచించారు. ‘ఇతర బీజేపీ నేతల్లాగే గిరిరాజ్ కూడా ఆర్‌ఎస్ఎస్ భావజాలం నుంచి స్ఫూర్తి పొందారని..ఆర్‌ఎస్ఎస్ ఎప్పుడూ అఖండ భారత్ విధానానికి కట్టుబడి ఉందనే విషయాన్ని గుర్తించాలని.. అంఖడ్ భారత స్ఫూర్తికి విరుద్ధంగా గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారని అన్నారు.