UPSC Mains Results : యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వైబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ త్వరలోనే ప్రకటించనుంది.

UPSC Mains Results : యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల

UPSC Mains Results

UPSC Mains Results : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వైబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఈ ఫలితాల్లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ త్వరలోనే ప్రకటించనుంది. ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్ లిస్టు తయారు చేస్తారు. సెప్టెంబర్ 16 నుంచి 25వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి.

మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ -2 నింపి, యూపీఎస్సీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. మెయిన్స్ రాసిన అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవాలి. యూపీఎస్సీ హోమ్ పేజీలో మెయిన్స్-2022 ఫలితాల లింక్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ వస్తుంది. పీడీఎఫ్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

Telangana Government Jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. 16వేల 940 ఉద్యోగాలు భర్తీ

ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రతిభ, మెయిన్స్, ప్రలిమ్స్ మార్కుల ఆధారంగా ఆలిండియా సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ ముందుగా 861 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత పోస్టుల సంఖ్యను 1011కు పెంచింది. మొత్తం 13 వేల మంది మెయిన్స్ పరీక్ష రాశారు.