UP Cop : పాపం పోలీస్, ప్లాస్టిక్ స్టూల్‌‌తో ఒకరు, వెదురుబుట్టలతో మరొకరు

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో నిరసనకారులను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల్లో ఒకరు తలకు ప్లాస్టిక్ స్టూలు ధరిస్తే.... మరొకరు వెదురుబుట్ట మూతను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు పాపం పోలీస్..అంటూ ఇతరత్రా కామెంట్స్ పెడుతున్నారు.

UP Cop : పాపం పోలీస్, ప్లాస్టిక్ స్టూల్‌‌తో ఒకరు, వెదురుబుట్టలతో మరొకరు

Up Cops

UP Cop : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లాలో నిరసనకారులను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల్లో ఒకరు తలకు ప్లాస్టిక్ స్టూలు ధరిస్తే…. మరొకరు వెదురుబుట్ట మూతను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు పాపం పోలీస్..అంటూ ఇతరత్రా కామెంట్స్ పెడుతున్నారు.

అసలేం జరిగిందంటే..

రాష్ట్రంలోని అక్రంపూర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతదేహాలతో ధర్నా చేసి రోడ్డును దిగ్బంధం చేశారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు, భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అప్పటికే ఆగ్రహంగా ఉన్న గ్రామస్థులు మరింత రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు.

గ్రామస్థుల రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ పోలీసు ప్లాస్టిక్ స్టూలును హెల్మెట్‌లా ధరిస్తే మరో పోలీసులు వెదురుబుట్ట మూతను కవచంగా పట్టుకున్నాడు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పోలీసులపై జోకులు పేలాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు…. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. సమస్య తీవ్రత తెలిసినా చేతుల్లో ఏం లేకుండా ఎలా వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ.. ఎస్పీ, స్థానిక అధికారుల నుంచి వివరణ కోరారు.