Dalit Man : మా ముందే గుర్రంపై ఊరేగితే.. చంపి పారేస్తాం : దళితుడికి బెదిరింపులు

పెళ్లిలో గుర్రం మీద ఊరేగుతూ వస్తే చంపేస్తామని కొంతమంది పెద్దలు బెదిరించారని దళిత యువకుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. గుర్రం మీద ఊరేగితేఊరుకునేది లేదని కాలి నడకన రావాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Dalit Man : మా ముందే గుర్రంపై ఊరేగితే.. చంపి పారేస్తాం : దళితుడికి బెదిరింపులు

Another Story

Dalit groom alleges threat against riding horse : ఈ కంప్యూటర్ యుగంలో కూడా దళితులపై వివక్షలు కొనసాగుతునే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అగ్రవర్ణాల పెద్దలు దళితులకు వింత వింత శిక్షలు విధిస్తుంటారు. గ్రామపెద్దలే నిర్ణయాలు తీసుకుని అనాగరిక శిక్షలు విధిస్తుంటారు. మూత్రం తాగించటం..ఉమ్మి నేలమీద వేసి నాకించటం వంటి శిక్షలు యూపీలో వెలుగులోకి వస్తుంటాయి. ఈక్రమంలో యూపీలోనే ‘ పెళ్లి సందర్బంగా గుర్రంపై ఊరేగితే (బారాత్) ఊరుకునేది లేదని..ఒళ్లు దగ్గర పెట్టుకుని మీ స్థాయికి తగినట్లుగా ఉండండీ‘‘అంటూ అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది ఓ దళితుడిని బెదిరించారు. ఈ విషయాన్ని సదరు దళితుడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వెలుగులోకి వచ్చింది.

యూపీలోని మ‌హోబా గ్రామానికి చెందిన అల‌ఖ్ రాం అనే ద‌ళిత యువ‌కుడు పోలీసులను ఆశ్రయించి నాకు జూన్ 18న వివాహం జరుగబోతోంది దయచేసి నాకు భ‌ద్ర‌త క‌ల్పించండి అని కోరాడు. దానికి కారణం ఏమంటని పోలీసులు అడుగగా..‘నాకు త్వరలో పెండ్లి జరుగనుంది. పెళ్లి ఊరేగింపులో గుర్రంపై ఊరేగింపుగా వెళితే వెళితే చంపేస్తామ‌ని కొంతమంది నన్ను బెదిరిస్తున్నారని..వారు చెప్పినట్లుగా చేయకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు కాబోయే వరుడు అల‌ఖ్ రాం చెప్పాడు.

త‌మ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా మా ఇంటి ఓ ఆనవాయితీ ఉంది. పెళ్లిలో వరుడు వధువు ఇంటికి గుర్రంపై ఊరేగుతూ వెళ్లాలి. ఇది మాకు ఎన్నో ఏళ్లుగా ఆన‌వాయితీగా వ‌స్తోంది..కానీ పెళ్లిలో నేను గుర్రం మీద ఊరేగితే నన్ను చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని వాపోయాడు. పోలీసుల సాయం తీసుకుని గుర్రంపై ఊరేగినా త‌ర్వాత త‌మ కుమారుడిని చంపేస్తామ‌ని ఇత‌ర కులాల వారు బెదిరిస్తున్నార‌ని బాధితుడి తండ్రి గ‌యాదిన్ కూడా ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. జూన్ 18న త‌న కుమారుడి పెండ్లి ఊరేగింపుకు అన్ని ఏర్పాట్లు చేస్తుండ‌గా తమకు బెదిరింపులు వ‌చ్చాయ‌ని భయపడుతూ చెప్పాడు.వారి ఫిర్యాదును స్వీకరించామని ద‌ర్యాప్తు జ‌రుపుతామ‌ని మ‌హోబ్ గంజ్ ఎస్ఐ ప్ర‌భాక‌ర్ ఉపాధ్యాయ తెలిపారు.

కాగా వరుడు అల‌ఖ్ రాం మహోబా జిల్లాలోని మహోబకాంత్ పీఎస్ పరిధిలోని మాధవగంజ్ గ్రామానికి చెందినవాడు. అల్ఖారామ్ అహిర్వర్ షెడ్యూల్డ్ కులానికి చెందిన వాడు. అలఖ్ రామ్ ఢిల్లీలో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇటీవల తమ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహాట్ లోని రామ్ సాఖితో వివాహం నిశ్చయమైంది. జూన్ 18న వారి వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. వెడ్డింగ్ కార్డులకు కూడా పంచారు. వివాహానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో వధువు గ్రామానికి చెందిన కొంతమంది కుల పెద్దలు వధువు కుటుంబానికి బెదిరింపులు పంపారు.

మీ ఇంటికి పెళ్లి చేసుకోవటానికి వచ్చే వరుడు గుర్రం మీద ఊరేగుతూ రావటానికి వీల్లేదని..అలా చేస్తే అతడిని చంపేస్తామని హెచ్చరించారు. వరుడు కాలి నడకన రావాలని తాము చెప్పినట్లు చేయకపోతే ఫలితం అనుభవించటానికి రెడీగా ఉండండీ అంటూ బెదరించారు. దీంతో భయపడిన వధువు కుటుంబం వరుడికి కబురు పంపింది. దీంతోవరుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కాగా యూపీలో అగ్రకులాల వారు దళితులపై దాడులు చేయటం కఠిన శిక్షలు విధించటం వంటి అనాగరిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.