Omicron : ఒమిక్రాన్ టెన్షన్.. ఇకపై 6గంటలు ఎయిర్ పోర్టులో వెయిట్ చేయాల్సిందే.. ప్రభుత్వం కొత్త రూల్

కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కట్టడికి అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా పలు..

Omicron : ఒమిక్రాన్ టెన్షన్.. ఇకపై 6గంటలు ఎయిర్ పోర్టులో వెయిట్ చేయాల్సిందే.. ప్రభుత్వం కొత్త రూల్

Omicron

Omicron : కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కట్టడికి అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా పలు ఆంక్షలు అమలు చేశాయి. జాగ్రత్తలు తీసుకున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొత్త రూల్ తీసుకొచ్చారు.

ఇకపై ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన దేశాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో 6 గంటల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, ప్రభుత్వం వారందరికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనుంది. అర్థరాత్రి నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన 14 దేశాలను రిస్క్ జాబితాలో చేర్చారు. ఆ దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టులో టెస్టులు చేయనున్నారు. పరీక్షలో కరోనా నెగిటివ్ అని రిజల్ట్ వస్తేనే ఆ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లగలరు. రిజల్ట్స్ రావడానికి నాలుగు నుంచి 6 గంటల సమయం పట్టనుంది. కాగా గంటలో 400 నుంచి 500 మందికి ఆర్టీపీసీఎస్ టెస్టులు చేసే సామర్థ్యాన్ని కంపెనీ కలిగుంది.

Indians : గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు అంతా మనోళ్లే..!

ఒమిక్రాన్‌ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలనే నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం నిలబడాల్సిన ప్రయాణీకుల కోసం ఎయిర్ పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్పెషల్ హోల్డింగ్ ఏరియాస్ లో ప్యాసింజర్లు భౌతికదూరం పాటిస్తూ నిరీక్షించాల్సి ఉంటుంది.

సగటున యూరప్ నుండి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్ 8.5 గంటలు పడుతుంది. విమానానికి ముందు విమానాశ్రయంలో రెండు గంటలు, ఢిల్లీ విమానాశ్రయంలో ఆరు గంటలు, కస్టమ్స్-ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేయడానికి, లగేజీని తీయడానికి కనీసం ఒక గంట జోడించుకున్నా.. ఢిల్లీ విమానాశ్రయం నుండి ప్రయాణీకుడు గమ్య స్థానం చేరుకోవడానికి కనీసం 17 గంటల సమయం పడుతుంది.

ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన దేశాల(యూరప్, సౌతాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్ వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంగ్ కాంగ్, ఇజ్రాయల్) నుంచి వచ్చే ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో RT-PCR విధానంలో టెస్టులు చేస్తారు. మిగతా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ర్యాండమ్ గా 5శాతం మందికి టెస్టులు చేయనున్నారు. ఈ ప్రయాణీకులందరూ ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నిష్క్రమించడానికి లేదా కనెక్టింగ్ ఫ్లైట్‌ని తీసుకోవడానికి అనుమతించబడటానికి ముందు విమానాశ్రయంలో చాలా గంటలు వేచి ఉండవలసి ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆర్టీపీసీఎస్ టెస్టు చేయించుకుని రిజల్ట్ కోసం వేచి చూసే ప్రయాణికుల కోసం భౌతిక దూరం పాటిస్తూ కుర్చీలు వేశారు.

Financial Planners : మీ ఆదాయం రూ.10లక్షల లోపేనా? నెలకు రూ.3,300 ఆదా చేస్తే.. రూ.9 కోట్లు కూడబెట్టొచ్చు.. ఎలాగంటే?

ఇక ఇటీవల దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం అంతర్జాతీయంగా వచ్చేవారిని పరీక్షించడానికి నిబంధనలు విధించింది. నేటి నుంచి యూరప్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ నుండి వచ్చే వారందరికీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు ఒమ్రికాన్‌ వేరియంట్‌ దృష్ట్యా ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు ఏడు రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేశాయి.