Hospital Mortuary: చనిపోయాడనుకుని మార్చురీలో పెడితే.. 7గంటల తర్వాత

దాదాపు ఏడు గంటల పాటు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత పంచనామా చేసేందుకు కుటుంబ సభ్యుల సంతకం కావాలని సిబ్బంది అడిగారు. ఈ ప్రక్రియ జరగడానికి ముందే తమకొక సారి చూపించాలని అడగడంతో...

Hospital Mortuary: చనిపోయాడనుకుని మార్చురీలో పెడితే.. 7గంటల తర్వాత

Mortury Box

Hospital Mortuary: బతికుండగానే హాస్పిటల్ మార్చురీ ఫ్రీజర్ బాక్సులో పెట్టేశారు. ఎట్టకేలకు ప్రాణాలతో ఉండగానే విషయం తెలియడంతో కాపాడగలిగారు. ఎలక్ట్రీషియన్ గా పనిచేసే శ్రీకేశ్ కుమార్ మోటార్ బైక్ తో యాక్సిడెంట్ అవడంతో గురువారం రాత్రి హాస్పిటల్ లో చేర్పించారు. డాక్టర్లు అతడు చనిపోయాడని తేల్చేశారు. ఆ తర్వాతి రోజు హాస్పిటల్ స్టాఫ్ శవాన్ని ఫ్రీజర్ లో పెట్టేశారు.

దాదాపు ఏడు గంటల పాటు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత పంచనామా చేసేందుకు కుటుంబ సభ్యుల సంతకం కావాలని సిబ్బంది అడిగారు. ఈ ప్రక్రియ జరగడానికి ముందే తమకొక సారి చూపించాలని అడగడంతో ఫ్యామిలీ మార్చురీకి వెళ్లారు. శవంగా అనుకుని బాక్సులో పెట్టేసిన వ్యక్తిలో కొన్ని కదలికలు కనిపించాయి.

‘బాధితుడి మరదలు మధుబాలా గమనించి డాక్టర్లను అలర్ట్ చేసింది. అతను చనిపోలేదు. ఇలా ఎలా చేశారు. అతనేదో చెప్పాలనుకుంటున్నాడు. శ్వాస కూడా తీసుకుంటున్నాడు’ అని అరిచింది.

…………………………………… : సీమ జిల్లాల్లో జల విలయంతో ప్రయాణికుల కష్టాలు

‘ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ తెల్లవారు జాము 3గంటల సమయంలో చెక్ చేసి హార్ట్ బీట్ లేదని చెప్పారు. చాలా సార్లు అతణ్ని పరీక్షించాం కూడా. అప్పుడే చనిపోయినట్లు కన్ఫమ్ చేశాం. తెల్లవారేసరికి పోలీసుల టీం, కుటుంబ సభ్యులు బతికి ఉన్నట్లు గుర్తించారు. ఎంక్వైరీ జరుగుతుంది నిజాలు తెలుస్తాయి. ప్రాణాలు కాపాడటానికే మేం ఇక్కడ ఉన్నాం’ అని మొర్దాబాద్ చీఫ్ మెడికల్ సూపరిండెంట్ డా.శివ్ సింగ్ అన్నారు.

‘చాలా అరుదుగా జరిగే సంఘటనల్లో ఇదొకటి. దీనిని నిర్లక్ష్యం అనలేం. ప్రస్తుతం హెల్త్ సెంటర్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది’ అని డాక్టర్లు చెబుతున్నారు.

తిరిగి స్పృహలోకి వచ్చినట్లు అతని మరదలు చెబుతోంది. కన్ఫామ్ చేసుకోకుండా మార్చురీలో పెట్టేసినందుకు డాక్టర్లపై కేసు పెడతామంటున్నారు కుటుంబ సభ్యులు.

………………………………………. : అనీ మాస్టర్ ఎలిమినేషన్!