Chandan Ram Das: ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి చందన్ రామ్‌దాస్ కన్నుమూత..

చందన్ రామ్‌దాస్ 2006లో బీజేపీలో చేరారు. 2007, 2012, 2017, 2022 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

Chandan Ram Das: ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి చందన్ రామ్‌దాస్ కన్నుమూత..

Chandan Ram Das

Chandan Ram Das: ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రి చందన్ రామ్‌దాస్ (65) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం బాగేశ్వర్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతూ చందన్ రామ్‌దాస్ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. కేబినెట్‌లోని నా సీనియర్ సహోద్యోగి చందన్ ఆకస్మిక మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం ప్రజా సేవ, రాజకీయ రంగంలో కోలుకోలేని‌లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

AP CM Jagan: ఓ ముసలాయన అంటూ.. చంద్రబాబుపై ‘మోసపూరిత పులి’ కథ చెప్పిన జగన్‌

చందన్ రామ్ దాస్ మృతికి బీజేపీ నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇదిలాఉంటే ఏప్రిల్ 26 నుంచి 28 వరకు రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి, బీజేపీ నేత అయిన చందన్ రామ్ దాస్ 1997లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ ఏడాది మున్సిపాలిటీ తొలి ఎన్నికల్లో బాగేశ్వర్ నుంచి విజయం సాధించాడు. మున్సిపాలిటీ స్వతంత్ర చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

Telangana : ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి : YS షర్మిల

2006లో బీజేపీలో చేరారు. 2007, 2012, 2017, 2022 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగేశ్వర్ నుంచి 14,567 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.