Telangana : ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి : YS షర్మిల

సర్కారు కళ్ళు తెరిపించేందుకే నిరుద్యోగుల కోసం కొట్లాట. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Telangana  : ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి : YS షర్మిల

Telangana : తెలంగాణలో tspsc ప్రశ్నాపత్రాల లీక్ పై వైఎస్సార్ టీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి షర్మిల అఖిల పక్ష నేతలతో ఇందిరాపార్క్ వద్ద ‘టీసేవ్’ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మరోసారి తెలంగాణ సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఘాటు విమర్శలు చేశారు. సర్కారు కళ్ళు తెరిపించేందుకే నిరుద్యోగుల కోసం కొట్లాట అన్నారు. బిస్వాల్ కమిటీ సిఫారసు మేరకు 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని..ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని..టీఎస్ పిఎస్సి పేపర్ లీక్ కేసును సీబీఐ కి అప్పగించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Telangana : తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప ఏమొచ్చింది…? ఇక కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ : గద్దర్

కాగా షర్మిల చేపట్టిన ఈ ‘టీ సేవ్’ కార్యక్రమానికి మద్దతు కరవు అయ్యింది. ఏ ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరుకాలేదు. కానీ ప్రజాగాయకుడు గద్దర్ టీసేవ్ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. టీసేవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్ నిరుద్యోగుల గురించి మాట్లాడుతు భావోద్వేగానికి గురి అయ్యారు. తెలంగాణ వచ్చాక ఏమొచ్చింది కన్నీళ్లు తప్ప ఏమొచ్చాయి? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. నీళ్లు నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ కోసం పోరాడం కానీ ఈనాడు యువతకు నియామకాలు ఎక్కడ ఉన్నాయి? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు గద్దర్. ఓటు హక్కుతోనే ఈ పాలకుడిని గద్దె దించాలి అంటూ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు గద్దర్. అది జరగాలంటే యువతలో రాజకీయ చైతన్యం రావాలని పిలుపునిచ్చారు.