Vande Bharat Express: ప్రమాదానికి గురైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఆవులను, గేదెలను గుద్దుకుని ఆగిపోవడం ఇది మూడోసారి..

ముంబై-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ మార్గంలో ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. అక్టోబరు 6న గుజరాత్‌లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళ్తుండగా రైలు ఢీకొని నాలుగు గేదెలు చనిపోయాయి. మరుసటి రోజు అక్టోబర్ 7న రెండవ ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ముంబైకి వెళుతుండగా ఒక ఆవును ఢీకొట్టింది. తాజాగా గుజరాత్‌లోని అతుల్ స్టేషన్ సమీపంలో పశువులను ఢీకొట్టింది.

Vande Bharat Express: ప్రమాదానికి గురైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఆవులను, గేదెలను గుద్దుకుని ఆగిపోవడం ఇది మూడోసారి..

Vande Bharat Express: ముంబై – గాంధీనగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గుజరాత్‌లో మరోసారి ప్రమాదానికి గురైంది. వల్సాద్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలును ప్రమాదానికి గురైంది. వందేభారత ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా ఓ ఆవు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రైలు ముందుభాగంలో దిగువ భాగం దెబ్బతింది. 2022 అక్టోబర్ మొదటి వారంలో జరిగిన రెండు ప్రమాదాలతో కలిపి రైలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి.

Vande Bharat Express Hit Cow : ఆవును ఢీకొట్టిన వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

ముంబై సెంట్రల్ డివిజన్‌లోని అతుల్ సమీపంలో శనివారం ఉదయం 8.17 గంటలకు రైలు పశువులను ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగిందని భారతీయ రైల్వే తెలిపింది. ప్రమాద సమయంలో రైలు ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్‌కు వెళ్తోంది. ఈ ఘటనతో రైలును దాదాపు 15 నిమిషాలపాటు నిలుపుదల చేశారు. ఈ ఘటనలో రైలు ముందు భాగంలో దెబ్బతినడం తప్ప ఎలాంటి నష్టం జరగలేదని, రైలు సజావుగా నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

Vande Bharat Express: మోదీ ప్రారంభించిన వందేభారత్-3 రైలు విశేషాలు ఏంటో తెలుసా?

ఇదిలాఉంటే ట్రాక్ దగ్గర పశువులను వదలవద్దని రైల్వే అధికారులు సమీప గ్రామస్తులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మరోవైపు రైలు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా గాంధీనగర్-అహ్మదాబాద్ సెక్షన్‌లో ఫెన్సింగ్ పనులను పశ్చిమ రైల్వే చేపట్టనున్నట్లు పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ చెప్పారు. 2024 మార్చి నాటికి ఫెన్సింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఠాకూర్ పేర్కొన్నాడు.

ముంబై-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ మార్గంలో ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. అక్టోబరు 6న గుజరాత్‌లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళ్తుండగా రైలు ఢీకొని నాలుగు గేదెలు చనిపోయాయి. దీనికితోడు రైలు ముందుభాగం దెబ్బతింది. మరుసటి రోజు అక్టోబర్ 7న రెండవ ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ముంబైకి వెళుతుండగా గుజరాత్‌లోని ఆనంద్ సమీపంలో ఒక ఆవును ఢీకొట్టింది. తాజాగా గుజరాత్‌లోని అతుల్ స్టేషన్ సమీపంలో పశువులను ఢీకొట్టింది.