Venus : ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా శుక్రగ్రహం.. సాయంత్రం వేళ పశ్చిమ దిశలో నేరుగా చూడొచ్చు

ఇప్పుడు శుక్రగ్రహం ఇదే స్థితిలో ఉన్నందున అధిక సూర్యరశ్మిని పొందుతూ ప్రకాశవంతంగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Venus : ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా శుక్రగ్రహం.. సాయంత్రం వేళ పశ్చిమ దిశలో నేరుగా చూడొచ్చు

Venus

Venus brightest : భూమికి అత్యంత దగ్గరగా ఉండే శుక్రగ్రహం ఇప్పుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఒక వజ్రంలా మెరుస్తూ కనిపిస్తోంది. సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత దీనిని భూమి మీద నుంచి నేరుగా చూడవచ్చు. సాధారణంగా శుక్రగ్రహం సూర్యుని మీదుగా లేదా కిందగా వెళ్లినప్పుడు సూర్యకాంతి దాని వాతావరణాన్ని ప్రతిబించించి శుక్రగ్రహం ప్రకాశవంతంగా మారుతుంది.

ఇప్పుడు శుక్రగ్రహం ఇదే స్థితిలో ఉన్నందున అధిక సూర్యరశ్మిని పొందుతూ ప్రకాశవంతంగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా సూర్యుని చుట్టూ దాని కక్ష్యలో తిరుగుతున్న శుక్రగ్రహం ఇప్పుడు సరిగ్గా భూమికి, సూర్యుడికి మధ్యకు వచ్చింది.

Cyclone Biparjoy: బిపర్‌జోయ్ తుపాన్ మరింత తీవ్రం..ఐఎండీ హెచ్చరిక

దీంతో శుక్రగ్రహాన్ని నేరుగా భూమి నుంచి వీక్షించేందుకు ఇది సరైన సమయమని తెలిపారు. పశ్చిమ దిశగా రాత్రి 7.30 నుంచి 9.45 ఆకాశంలో మెరిసే శుక్రుడిని నేరుగా చూడవచ్చని పేర్కొన్నారు.