ట్రంప్ ట్విట్టర్ బ్యాన్ వెనుక తెలుగు మహిళ

ట్రంప్ ట్విట్టర్ బ్యాన్ వెనుక తెలుగు మహిళ

Vijaya Gadde : అమెరికా అధ్యక్ష పీఠం నుంచి కొద్ది రోజుల్లో దిగిపోనున్న డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను శాశ్వతంగా బ్యాన్ చేయాలన్న సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వెనుక ఓ తెలుగు మహిళ ఉన్నారనే వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఆరాటపడ్డారు. ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చారు. ఆమె పూర్వీకులు తెలుగు వారేనని తెలుస్తోంది. క్యాపిటల్ హిల్ ఘటనపై ట్రంప్ మద్దతు దారులు దాడి చేయడం, ట్విట్టర్ వేదికగా ట్రంప్ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ట్విట్టర్ యాజమాన్యం గుర్తించింది. వెంటనే పోస్టులు తొలగించాలని తగిన సమయం కేటాయించింది. అనంతరం శాశ్వతంగా ట్విట్టర్ అకౌంట్ ను బ్యాన్ చేసేసింది. ఆ సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వెనుక 45 సంవత్సరాలున్న విజయ గద్దె కూడా ఉన్నారు.

ఈమె ఎవరు ?

విజయ గద్దె. ట్విట్టర్ సంస్థలో టాప్ పాలసీ మేకర్ గా పనిచేస్తున్నారు. లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ విభాగానికి ఈమె టీమ్ లీడర్. విజయ గద్దె కుటుంబం అమెరికాకు వలస వెళ్లారు. టెక్సాస్ లోని బ్యూ మౌంట్ లో స్థిరపడ్డారు. కార్నెల్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ లా స్కూల్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారామె. బే ఏరియా బేస్డ్ లా కంపెనీతో కలిసి టెక్ స్టార్టప్ ల కోసం పని చేశారు. ఇక 2011 నుంచి ట్విట్టర్ లో జాయిన్ అయ్యారు. మైక్రో బ్లాగ్లింగ్ సైట్ లో అత్యంత కీలక విభాగంగా భావించే లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ బాధ్యతలు ప్రస్తుతం నిర్వరిస్తున్నారు. గత కొంతకాలంగా ట్విట్టర్ రూపు రేఖలను మార్చడంలో ఈమె ప్రధాన పాత్ర పోషించారు.

Vijaya Gadde

సొంతంగా గద్దె ఎంజెల్స్ అనే పబ్లిక్ రిలేషన్ స్టార్టప్ ను స్థాపించారు. మహిళలకు సమాన వేతనం వంటి అంశాల సాధన కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. ఇన్ స్లైల్ మేగజేన్ నిర్వహించిన సర్వేలో శక్తి సామర్థ్యాలు ఉన్న తొలి 50 మంది మహిళల జాబితాలో విజయ గద్దె చోటు సంపాదించారు. వాషింగ్టన్ లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులను ఈమె గమనించారు. అందులో భాగంగా ట్రంప్ చేస్తున్న ట్వీట్స్ ను నిశితంగా పరిశీలించారు. రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని విజయ గద్దె నిర్ధారించారు. తొలుత 12 గంటల పాటు..ఆ తర్వాత..శాశ్వతంగా ట్విట్టర్ అకౌంట్ ను నిషేధిస్తూ..విజయ గద్దె నిర్ణయాలను తీసుకున్నారు. ఈమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది.