UP Government Hospital : ఇంత నిర్లక్ష్యమా ? కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్

ఉత్తరప్రదేశ్‌లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. యూపీ సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాలోని ఓ పీహెచ్‌సీలో కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ జరిగిపోయింది. రెండో డోసుకు వచ్చిన వారికి తొలి డోసులో వేసిన వ్యాక్సిన్ కాకుండా వేరేదిచ్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలి డోస్ ఏ టీకా తీసుకుంటే... రెండో డోస్‌ కూడా అదే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

UP Government Hospital : ఇంత నిర్లక్ష్యమా ? కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్

Uttar Pradesh

Covishield + Covaxin : ఉత్తరప్రదేశ్‌లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. యూపీ సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాలోని ఓ పీహెచ్‌సీలో కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ జరిగిపోయింది. రెండో డోసుకు వచ్చిన వారికి తొలి డోసులో వేసిన వ్యాక్సిన్ కాకుండా వేరేదిచ్చారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలి డోస్ ఏ టీకా తీసుకుంటే… రెండో డోస్‌ కూడా అదే తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ సిద్ధార్ధ్ న‌గ‌ర్ జిల్లా ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ లో ఓ గ్రామంలో 20 మందికి మాత్రం ఏప్రిల్ 1న డోస్‌ కింద కోవిషీల్డ్‌ ఇవ్వగా.. మే 14న రెండో డోస్‌ కోవాగ్జిన్‌ ఇచ్చారు. దీంతో 20 మంది అయోమయంలో పడ్డారు.

తప్పు తెలుసుకున్న అధికారులు ఆ 20 మందిని వైద్య పరిశీలనలో ఉంచారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకు వీరిలో ఎవరికి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని అధికారులు తెలిపారు. రెండు రకాలు టీకాలు ఇవ్వమని ఎలాంటి ఆదేశాలు లేవన్నారు. వైద్య సిబ్బంది నిర్వాకంపై స్థానిక ఆరోగ్య అధికారులు విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని సిద్ధార్థ్‌నగర్‌ జిల్లా చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ డాక్టర్ సందీప్‌ చౌధరి తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత తమను ఎవరూ కలవలేదని మిక్స్‌డ్ టీకా తీసుకున్న గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వచ్చి చూసిన పాపానపోలేదంటున్నారు.

ఓ వైపు కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో పొరపాట్లు టీకా కార్యక్రమాన్ని వెనక్కి లాగుతున్నాయి. అయితే ఈ 20 మంది టీకా వేసుకున్నట్లా? లేక తీసుకోనట్లా? వారికి కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందా లేదా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న పెద్ద రాష్ట్రాల్లో యూపీ ముందు వరుసలో ఉంది. యూపీలోని 23 కోట్ల జనాభాలో ఇప్పటివరకు 33 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు.

Read More : Telangana Junior Doctors : జుడాల సమ్మె విరమణ