Girijatmaj Vinayaka : బౌద్ధగుహల్లో వెలసిన గిరిజాత్మత వినాయకుడు ప్రత్యేకత

అష్టావినాయక క్షేత్రాల్లో ఒకటి ‘గిరిజాత్మజ వినాయకుడు’ . ఎతైన పర్వతంపై బౌద్ధ గుహల్లో వెలసిన ఈ గిరిజాత్మజ గణపతిని వినాయక చవితి పండుగ రోజున దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి.

Girijatmaj Vinayaka : బౌద్ధగుహల్లో వెలసిన గిరిజాత్మత వినాయకుడు ప్రత్యేకత

Girijatmaj Vinayaka (2)

girijatmaj vinayaka in maharashtra : మహారాష్ట్రలో హిందువులు వినాయక చవితి పండుగ సందర్భంగా అష్టవినాయక యాత్రను చేస్తారు. అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకుంటారు. మొత్తం అష్టవినాయక క్షేత్రాలను దర్శించుకోవాలంటే 654 కి.మీ ప్రయాణించాలి. ఈ అష్టావినాయక క్షేత్రాల్లో ఒకటి ‘గిరిజాత్మజ వినాయకుడు’ ఈ గణపతి కొండలపై ఉన్న గుహలో వెలసి భక్తులతో పూజలందుకుంటున్నాడు.

పుణెకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లేన్యాద్రి’ పర్వతంమీద బౌద్ధగుహల మధ్యన ఉన్న ఆలయమే ‘గిరిజాత్మజ్ వినాయక ఆలయం’. గిరిజాత్మజుడు అంటే పార్వతీ నందనుడు అని అర్థం. ఈ గణపయ్యను దర్శించుకోవటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎతైన పర్వతంమీద బౌద్ధ గుహలో కొలువై ఉంటాడీ లంబోదరుడు. పర్వతం పైకి వెళ్లాలంటే దాదాపు 300కుపైగా మెట్లు ఎక్కి వెళ్లాలి. పిల్లలు, వయస్సులో ఉన్నవారు చురుగ్గా ఎక్కగలరేమో గానీ కాస్త పెద్ద వయస్సు వారికి..అనారోగ్యాలు ఉన్నవారికి కాస్త కష్టమనే చెప్పాలి. అటువంటివారు స్వామిని దర్శించుకోవాలనే కోరిక ఉంటే డోలీల సహాయంతో వెళ్లవచ్చు.అటువంటి సౌకర్యం ఉంది ఇక్కడ.

పుత్రుడ కోసం పార్వతీదేవి 12 ఏళ్లు ఘోర తపస్సు చేసిన ప్రదేశం ఈ లేన్యాద్రి పుణ్యక్షేత్రం. పార్వతీ దేవి 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతే నలుగుపిండితో చేసిన బాలగణపతిని చేసి ఆ బొమ్కు ప్రాణం పోసిందనీ..ఆ బుల్లిగణపయ్యకు కౌమారప్రాయం వచ్చేవరకూ గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నడనీ పౌరాణిక కథనం. ఈ గిరిజాత్తజ గణపతి అచ్చు నలుగుపిండితో చేసినట్టే…రూపురేఖలు స్పష్టంగా కనిపించకుండా ఉంటాడు.

స్తంభాలు అనేవి లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. విద్యుద్ధీపాల అవసరం లేకుండా పగటివేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడంచేత ఈ స్వామిని సుఖంగా దర్శించకోవచ్చు. అదే ఈ గిరిజాత్తజ వినాయకుడి ఆలయం ప్రత్యేకత. ఈ స్వామిని పూజిస్తే సర్వపాపాలు పోతాయని భర్తులు నమ్మకం.