Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!

ప్రసిద్ధ  శివాలయంలో మహా అద్భుతం జరిగింది. శివలింగంపై మంచు కనిపించింది. శివలింగంపై మంచును చూసిన పూజారులు, భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!

Viral Video : ప్రసిద్ధ  శివాలయంలో మహా అద్భుతం జరిగింది. శివలింగంపై మంచు కనిపించింది. శివలింగంపై మంచును చూసిన పూజారులు, భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఆ శివమహేమనంటూ విశ్వసిస్తున్నారు. ఈ అద్భుతమైన ఘటన మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ప్రసిద్ధ త్రయంబకేశ్వర ఆలయంలో జరిగింది.

ఆలయంలో శివలింగానికి పూజారి పూలతో అర్చన చేశారు. అభిషేకం సమయంలో శివలింగంపై తెల్లగా మంచు ఏర్పడింది. వెంటనే పూజారి పూలను తీసి చూడగా.. నిజంగానే శివలింగంపై మంచు ఉంది. ఆ మంచుగడ్డను పూజారి చేతితో తడిమి చూసి ఆశ్చర్యపోయాడు. ఇదంతా ఆ శివయ్య లీలలే అంటూ స్వామికి పూజను కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నరేంద్ర అహోర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహలో అమరేశ్వర్ మహాదేవ్ రూపంలో మంచు శివలింగం ఉంటుంది. ఈ మహాశివుడిని దర్శించుకునేందుకు ప్రతి ఏడాదిలో వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. కరోనా కారణంగా పవిత్ర అమర్ నాథ్ యాత్ర రెండేళ్ల విరామం తర్వాత మొదలైంది. జూన్‌ 30న ప్రారంభమైన ఈ యాత్ర సమయంలో త్రయంబకేశ్వర ఆలయంలోని శివలింగంపై మంచుగడ్డ ఏర్పడటమనేది మహా అద్భుతమని, అది శివుని మహిమే అని నెటిజన్లు అంటున్నారు.

Read Also :  Viral Video: ఆమె 73ఏళ్ల వృద్ధురాలు కాదు.. 73ఏళ్ల యంగ్ లేడీ.. ఈ వీడియోచూస్తే మీరూ అలానే అంటారు..