ప్లీజ్ చెక్ ఇట్ : ప్లే స్టోర్‌లో ‘ఓటర్ హెల్ప్ లైన్’ యాప్

  • Published By: madhu ,Published On : March 9, 2019 / 09:40 AM IST
ప్లీజ్ చెక్ ఇట్ : ప్లే స్టోర్‌లో ‘ఓటర్ హెల్ప్ లైన్’ యాప్

తెలుగు రాష్ట్రాల్లో తమ ఓటు ఉందో లేదో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఓట్లను దొంగిలిస్తున్నారనే వార్తలు సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఓటు ఉందా ? అనేది తెలుసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. అయితే ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇందుకు ఓ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడమే. 

గూగుల్ ప్లే స్టోర్ నుండి ‘ఓటర్ హెల్ప్ లైన్’ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. మీ పేరు, తండ్రి పేరు, వయస్సు, నియోజకవర్గం, జిల్లా తదితర వివరాలు టైప్ చేయాలి. వెంటనే మీ ఓటుకు సంబంధించిన జాబితా మొత్తం ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ ఓటర్ కార్డు నెంబర్ తెలిసి ఉంటే ఆ నంబరును యాప్‌లో నమోదు చేయడం ద్వారా కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. మా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు..ఎలా అని డౌట్ వస్తే..నో ప్రాబ్లం…వెంటనే టోల్‌ ఫ్రీ నంబరు 1950 కు కాల్‌ చేస్తే వివరాలు తెలుస్తాయి. ఓటు తొలగిస్తే..ఈ యాప్ ద్వారా అధికారులకు కంప్లయింట్ చేయొచ్చు. కొత్తగా ఓటు నమోదు కూడా చేసుకునే ఛాన్స్ ఉంది. ఫారం 6, ఫారం 7, వివరాల మార్పుకు పారం 8..ఇలా ఇలా అన్ని ఈ యాప్‌లోనే అన్నీ ఉన్నాయి. అంతేకాదు…ఎన్నికల సమయంలో అభ్యర్థుల వివరాలు..తదితర సమాచారం కూడా ఈ యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి.