ఇప్పుడు 15 లక్షలు వేస్తారా :  భారత్ కు బ్లాక్ మనీ అకౌంట్ వివరాలు ఇచ్చిన స్విస్

  • Published By: venkaiahnaidu ,Published On : October 7, 2019 / 11:27 AM IST
ఇప్పుడు 15 లక్షలు వేస్తారా :  భారత్ కు బ్లాక్ మనీ అకౌంట్ వివరాలు ఇచ్చిన స్విస్

స్విస్ బ్యాంకుల్లో ఫైనాన్షియల్ అకౌంట్స్ రన్ చేస్తున్న భారతీయుల వివరాలు మొదటిసారిగా భారత్ కు అందాయి. నల్లధనానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఇది పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. రెండు దేశాల మధ్య… ఇన్ఫోమేషన్ ఫ్రేమ్‌వర్క్ యొక్క కొత్త ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్(AEOI) ఒప్పందం కింద స్విట్జర్లాండ్ మొదటిసారి భారతదేశానికి వారి వివరాలను అప్పగించింది. స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(FTA) స్విస్ బ్యాంకులలోని ఫైనాన్షియల్ అకౌంట్స్ వివరాలను షేర్ చేసిన 75 దేశాలలో భారత్ కూడా ఒకటి అని ఎఫ్ టీ ఏ ప్రతినిధి తెలిపారు.

AEOIఫ్రేమ్ వర్క్ కింద మొదటిసారిగా భారత్ స్విట్జర్లాండ్ నుంచి ఈ వివరాలు పొందింది. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న ఆర్థిక ఖాతాలతో పాటు 2018 లో మూసివేయబడిన ఖాతాల సమాచారాన్ని కూడా AEOI కింద అందిస్తారు.. 2020లో మరోసారి స్విస్ లో ఫైనాన్షియల్ అకౌంట్ల వివరాల గురించి ఇతర దేశాలకు వివరాలను అందించనున్నట్లు FTA ప్రతినిధి తెలిపారు.

అయితే ఎక్స్ఛేంజ్ కఠినమైన గోప్యత నిబంధనల ద్వారా నిర్వహించబడుతుంది.  ఖాతాల సంఖ్య, స్విస్ బ్యాంకులో భారతీయ ఖాతాదారుల ఖాతాలతో సంబంధం ఉన్న ఆర్థిక ఆస్తుల పరిమాణం గురించి నిర్దిష్ట వివరాలను వెల్లడించడానికి  ఎఫ్ టీ ఏ అధికారులు నిరాకరించారు.  ఎక్సేంజ్ లో ఇన్ఫర్మెషన్ లో  గుర్తింపు, ఖాతా, ఆర్థిక సమాచారం ఉన్నాయి.  వీటిలో పేరు, చిరునామా, నివాస స్థితి, పన్ను గుర్తింపు సంఖ్య, అలాగే ఆర్థిక సంస్థ, ఖాతా బ్యాలెన్స్, మూలధన ఆదాయానికి సంబంధించిన సమాచారం ఉన్నాయి.  AEOI (ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) జరిగిన దేశాల సంఖ్య ఈ సంవత్సరం 75 కి పెరిగిందని  స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.