బీజేపీ హయాంలో CBI పాన్ షాప్‌లా మారింది

బీజేపీ హయాంలో CBI పాన్ షాప్‌లా మారింది

CBI: రాష్ట్రంలో సుప్రీం కోర్టు పాలనను స్వాగతిస్తూ.. బీజేపీ హయాంలో సీబీఐ వైఖరి పాన్ షాప్ లా మారిందని మహారాష్ట్ర మినిష్టర్ అస్లాం షేక్ విమర్శించారు. ఇదెక్కడికైనా వెళ్లగలదు. ఎవరినైనా బుక్ చేయగలదు. సీఎంలకు, మంత్రులకు వ్యతిరేకంగా కూడా యాక్షన్ తీసుకోగలదు.

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా రాష్ట్రంలో సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ చేయదలచుకుంటే సీబీఐ ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సిందేనంటూ ట్వీట్ లో పోస్టు చేశారు.



జస్టిస్‌లు ఏఎమ్ ఖాన్విల్కర్, బీఆర్ గవాయ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన బెంచ్.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ గురించి చర్చించింది.
https://10tv.in/karachi-sweets-shop-owner-in-bandra-west-to-change-the-name-karachi/
సీబీఐ విచారణకు రాష్ట్ర అనుమతి:
గుర్తు తెలియని చానెళ్లు, వ్యక్తులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన కేసును సీబీఐ విత్ డ్రా చేసుకుంది. ఇదే తరహాలో అధికారంలో లేని బీజేపీయేతర రాష్ట్రాలు సీబీఐకు ఇచ్చే ఆమోదాన్ని వెనక్కుతీసేసుకున్నాయి.