Weekend Lockdowns : వీకెండ్ లాక్‌డౌన్లు వర్కౌట్ కావు.. కఠినమైన కంటైన్మెంట్ జోన్లతోనే సాధ్యం!

భారత దేశంలో సోమవారం (ఏప్రిల్ 5)న 55.11 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే రికార్డు స్థాయిలో కొత్త కరోనాకేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో వారాంతాలలో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.

Weekend Lockdowns : వీకెండ్ లాక్‌డౌన్లు వర్కౌట్ కావు.. కఠినమైన కంటైన్మెంట్ జోన్లతోనే సాధ్యం!

Weekend Lockdowns Don’t Work, Centre Told Maharashtra

Weekend Lockdowns : భారత దేశంలో సోమవారం (ఏప్రిల్ 5)న 55.11 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే రికార్డు స్థాయిలో కొత్త కరోనాకేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో వారాంతాలలో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఏప్రిల్ చివరి వరకు కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది. అయితే వీకెండ్ లాక్ డౌన్ లతో కరోనాను కట్టడి చేయలేమని కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు సూచించింది.

వీకెండ్ లాక్ డౌన్లతో పరిమితంగానే ప్రభావం ఉంటుందే తప్పా కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయలేదని పేర్కొంది. కేబినెట్ సెక్రటరీ మీటింగ్ లో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ వీకెండ్ లాక్ డౌన్లపై ఎలాంటి చర్చ జరపలేదని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవానికి మార్చి 15న మహారాష్ట్రలో 16,620 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 63.21శాతానికి పెరిగింది.

ఒక్క మహారాష్ట్రలోనే కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని, వెంటనే కరోనా కట్టడికి కంటైన్మెంట్ వంటి అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. లాక్ డౌన్లతో కరోనా వ్యాప్తిని నియంత్రించలేమని తెలిపింది. కరోనా వ్యాప్తికి రాత్రిపూట కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్లు పరిమిత ప్రభావం మాత్రమే ఉంటుందని పేర్కొంది. సమర్థతవంతమైన కఠినమైన కంటైన్మెంట్ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించింది. మార్చి 30న కేంద్రం మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాలకు నిఘా బృందాలకు శిక్షణ ఇవ్వాల్సిందిగా సూచించింది. రోజువారీ ప్రతిపాదికన కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుకు సంబంధించి సమీక్ష జరపాల్సిందిగా సూచించింది.