వెస్ట్ బెంగాల్ లో ఉచిత కరెంట్…మమత బంపరాఫర్

  • Published By: venkaiahnaidu ,Published On : February 10, 2020 / 10:53 AM IST
వెస్ట్ బెంగాల్ లో ఉచిత కరెంట్…మమత బంపరాఫర్

రాష్ట్రవాప్తంగా ఉచిత కరెంట్ ఇవ్వనున్నట్లు సోమవారం(ఫిబ్రవరి-10,2020) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ఇందుకు షరుతులు వర్తిస్తాయి అంటోంది మమతా. వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియా సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ…ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రాలను సంప్రదించడం లేదని అన్నారు. రాజకీయాలు,ద్వేషం కన్నా ముందు ఎకానమీ గురించి చూడాలన్నారు. వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఇకపై ఉచిత కరెంట్ ఇస్తామని,అయితే మూడు నెలల వినియోగం 75యూనిట్ల వరకు ఉన్నవాళ్లకు మాత్రమే ఫ్రీ ఎలక్ట్రిసిటీ వర్తిస్తుందని మమత మెలిక పెట్టారు.

మరోవైపు మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడి ప్రభుత్వం కూడా ఈ ఉచిత కరెంట్ గురించి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.  గృహవినియోగదారులు ఎవరైతే నెలకు 100యూనిట్లవరకు వినియోగిస్తారో వాళ్లకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలని ఉద్దవ్ సర్కార్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్రవాప్తంగా కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించాలని,రైతులకు పగటివెళలో కరెంట్ ఇవ్వాలని మహారాష్ట్ర సర్కర్ ఆలోచన చేస్తుంది.

మరోవైపు ఇవాళ మమత ప్రకటనపై ఢిల్లీ సీఎం.ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. చౌక విద్యుత్తు.. దేశవ్యాప్త రాజకీయ ఉపన్యాసంలో భాగంగా మారిందని, చౌక విద్యుత్తు ఢిల్లీలోగా ఓట్లను కూడా తెచ్చిపెడుతుందని అన్నారు. ఉచిత,చౌక విద్యుత్తు అందించడం సాధ్యమేనని ఢిల్లీ నిరూపించిందని ఆయన అన్నారు. చౌక విద్యుత్తు,ఉచిత విద్యుత్తు ద్వారా ఓట్లు కూడా వస్తాయని ఢిల్లీ చూపించిందని అన్నారు. 21వ శతాబ్దంలో భారత్ ప్రతి ఒక్కరికీ చౌక రేట్లలో 24/7కరెంట్ అందుబాటులో ఉండాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.