PM Modi: రవిశంకర ప్రసాద్, ప్రకాష్ జావడేకర్ ఉద్వాసనకు కారణమేంటి?

గత వారం పదిరోజుల నుండి దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలకంగా మారిన మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఎట్టకేలకు మోడీ 2.0 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. అందులో కొందరి పనితీరు కొలమానంగా అందలం ఎక్కించామని అధిష్టానం చెప్పుకుంటుంటే.. ప్రధాని మోడీతో సన్నిహితంగా ఉన్న, ముఖ్య నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేయడం విస్మయానికి గురిచేసింది.

PM Modi: రవిశంకర ప్రసాద్, ప్రకాష్ జావడేకర్ ఉద్వాసనకు కారణమేంటి?

Pm Modi

PM Modi: గత వారం పదిరోజుల నుండి దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలకంగా మారిన మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఎట్టకేలకు మోడీ 2.0 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. అందులో కొందరి పనితీరు కొలమానంగా అందలం ఎక్కించామని అధిష్టానం చెప్పుకుంటుంటే.. ప్రధాని మోడీతో సన్నిహితంగా ఉన్న, ముఖ్య నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేయడం విస్మయానికి గురిచేసింది. సీనియర్‌ మంత్రులైన రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, హర్షవర్ధన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌, డీవీ సదానంద గౌడ, సంతో్‌షకుమార్‌ గాంగ్వార్‌కు విస్తరణలో ఉద్వాసన పలికారు.

ఇందులో కీలకమైన విద్య, వైద్యం, న్యాయం, పర్యావరణ శాఖల మంత్రులు కూడా ఇందులో ఉండడం గమనార్హం. మిగతా అందరి సంగతి ఎలా ఉన్నా రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావదేకర్ రాజీనామా కాస్త కలవరానికి గురిచేస్తోంది. కీలక శాఖలు చూస్తున్న కేంద్రమంత్రులు రాజీనామా జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొనగా రాష్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ ఈ రాజీనామాలను ఆమోదించడం కూడా పూర్తయింది. ఇందులో రవిశంకర్ ప్రసాద్ కీలకమైన ఐటీ శాఖ చూస్తుండగా.. జావదేకర్ పర్యావరణశాఖను చూస్తున్నారు. గత మంత్రివర్గ విస్తరణలో జావదేకర్‌కు ప్రమోషన్ రాగా మలి విడతలో ఆయన బెర్త్ ఖాళీ చేయాల్సి వచ్చింది.

అయితే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన రాజకీయ అంశాలలో ఈ ఇద్దరి రాజీనామా కీలకంగా కనిపిస్తుంది. మళ్ళీ అధికారిక ప్రతినిధులుగా పంపడానికి వారిని తొలగించారా.. లేక పని తీరు బాగాలేదని కారణంగానే ఉద్వాసన పలికారా అన్న దానిపై రకరకాల విశ్లేషణలు కొనసాగుతున్నాయి. రవిశంకర్ ప్రసాద్ రాజీనామాకు ఈ మధ్యనే తలెత్తిన ట్విట్టర్ వివాదమే కారణమని ఓ ప్రచారం జరుగుతుంది. అంతర్జాతీయ సమాజంలో భారత్ సోషల్ మీడియాను నియంత్రిస్తుందనేలా కనిపించడంలో రవిశంకర్ తప్పిదమేనని కేంద్రం భావిస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇక దేశంలో కరోనా సెకండ్ వేవ్.. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయిన రోగుల వలనే ప్రకాష్ జావడేకర్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆయన క్రియాశీలకంగా లేనికారణంగానే బెర్త్ ఖాళీ చేయాల్సి వచ్చిందని.. ఆయన వలనే కోవిడ్ వ్యవహారంలో కేంద్రం పూర్తిగా విఫలమైన భావన కలిగిందని కేంద్రం భావించినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక.. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో వీరి సేవలను పార్టీ వాడుకోవడం కోసమే ఇప్పుడు వీరిని మంత్రి పదవులను నుండి తప్పించారనే వాదన కూడా మరొకటి ఉంది.