WhatsApp రికార్డు : 2 వేల కోట్లు మెసేజ్‌లు చేసిన భారతీయులు

  • Published By: madhu ,Published On : January 4, 2020 / 01:13 AM IST
WhatsApp రికార్డు : 2 వేల కోట్లు మెసేజ్‌లు చేసిన భారతీయులు

నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్..మీ కుటుంబసభ్యులకు విషెస్..ఇలా..వాట్సాప్‌లో డిసెంబర్ 31న రాత్రి భారతీయులు తమతమ వారికి మెసేజ్‌లు పంపించారు. ఈ మేసెజ్‌లు చూసిన వాట్సాప్ యాజమాన్యం ఆశ్చర్యపోయింది.

ఏకంగా 20 బిలియన్లు అంటే..2 వేల కోట్లు మెసేజ్‌లు పంపించారని వాట్సాప్ వెల్లడించింది. దీనివల్ల గంటసేపు క్రాష్ అయ్యిందని, దీంతో వాట్సాప్ సేవలను నిలిచిపోయాయని తెలిపింది. కొద్దిసేపటి తర్వాత సేవలను పునరుద్ధరించినట్లు వివరించింది. 

వాట్సాప్..దీని గురించి తెలియని వారుండరు. తక్కువ కాలంలోనే అందరి ఫోన్లలో చేరిపోయింది. ఫోన్ ఉన్న ప్రతొక్కరూ వాట్సాప్ యూజ్ చేస్తుంటారు. దీనివల్ల SMSలకు ఎప్పుడో ఫుల్ స్టాప్ పడిపోయింది. విషెస్, మెసేజ్, ఫొటోలు, వీడియోలు, ఇలా ఏదైనా సమాచారాన్ని ఇతరులకు పంపించాలంటే..వాట్సాప్‌ యూజ్ చేస్తున్నారు.

 

అలాగే డిసెంబర్ 31వ తేదీన రాత్రి 12 గంటల నుంచి జనవరి 01వ తేదీ ఉదయం 11 గంటల 59 నిమిషాలకు వరకు భారతీయులు పంపిన మెసేజ్‌లతో వాట్సాప్ రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 75 బిలియన్ల మెసేజ్‌లు ఉంటే..అందులో భారతీయులు 2 వేల కోట్ల మెసేజ్‌లున్నాయి. ఈ స్థాయిలో మెసేజ్‌లు పంపడం ఇదే తొలిసారని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు వంద కోట్ల యూజర్లు ఉంటే..భారత్‌లో 20 కోట్ల మంది ఉన్నారు. 

Read More : బొద్దింక ఉందని..IndiGoకు రూ. 50 వేల ఫైన్