Bridge For Groom : తెల్లారేసరికల్లా వరుడి కోసం వంతెన కట్టేసిన గ్రామస్తులు

వరుడి కోసం ఓ గ్రామంలోని జనాలంతా కలిసి రాత్రికి రాత్రే ఓ వంతెన కట్టేశారు. రాత్రికి వంతెనలేదు. గానీ ఉదయం తెల్లవారేసరికి వెదురు గడలతో వంతెన ప్రత్యక్షమైంది. ఎందుకు అంత అర్జంట్ గా కట్టేయాల్సి వచ్చిందీ అంటే..ఆ గ్రామంలో ఓ వివాహం జరగాలి. వివాహం జరగాలంటే వరుడు రావాలి కదా. అందుకే వరుడి కోసం వంతెన నిర్మించారు.

Bridge For Groom : తెల్లారేసరికల్లా వరుడి కోసం వంతెన కట్టేసిన గ్రామస్తులు

Bamboo Bridge For The Groom

Bamboo bridge For the Groom : వరుడి కోసం ఓ గ్రామంలోని జనాలంతా కలిసి రాత్రికి రాత్రే ఓ వంతెన కట్టేశారు. రాత్రికి వంతెనలేదు. గానీ ఉదయం తెల్లవారేసరికి వెదురు గడలతో వంతెన ప్రత్యక్షమైంది. ఎందుకు అంత అర్జంట్ గా కట్టేయాల్సి వచ్చిందీ అంటే..ఆ గ్రామంలో ఓ వివాహం జరగాలి. వివాహం జరగాలంటే వరుడు రావాలి కదా. అందుకే ఆ వరుడి కోసం గ్రామస్తులు రాత్రికి రాత్రే వంతెన కట్టేశారు. బీహార్ లో జరిగిన ఎన్నో వివాహాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న క్రమంలో ఈ వివాహం కూడా అటువంటిదే. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి.బీహార్ లో ఓ గ్రామంలో పెళ్లి జరగాల్సి ఉండగా..వరుడు అత్తగారి ఇంటి నుంచి వధువును తన భుజాలపై ఎత్తుకుని మోసుకుంటూ వాగు దాటి తన ఇంటికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. మరో పెళ్లి విషయంలో వధువును కుటుంబ సభ్యులు పడవలో అత్తారింటికి పంపారు. ఇదిగో మనం చెప్పుకునే వరుడి కోసం వంతెన కూడా అటువంటిదే.

బీహార్‌లోని అరరియాలోని ఫుల్సర గ్రామానికి చెందినది. తమ గ్రామంలోని అమ్మాయిని చేసుకోవాటానికి మగపెళ్లివారు వస్తున్నారు. వరుడు, అతడి బంధువర్గం మేళతాళాలతో వస్తున్నారు. వాళ్లు రావాలంటే కాలువ దాటాలి. దాటాలంటే నీళ్లల్లో దిగాలి. అలా వారు కాలువలో దిగకుండా..రాత్రికి రాత్రే కాలువపై వెదురు వంతెన నిర్మించేశారు గ్రామస్థులు. క్రితం రోజు సాయంత్రం వరకూ ఆ కాలువ మీద వంతెన లేదు. కానీ..తెల్లవారే సరికల్లా వంతెన ప్రత్యక్షమైంది. సదరు గ్రామానికి రహదారి లేకపోవడంతో.. కాలువ గుండా వివాహాది శుభకార్యాలకు బంధు మిత్రులు వచ్చే అవకాశం తక్కువ. అందుకే అక్కడ పెళ్లిళ్లు ఎక్కువ జరగవు. జరిగినా ఎవ్వరూ రారు. గ్రామస్తులు తమ కుమార్తెలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వివాహం జరిపించేవారు. కానీ ఇటువంటి దుస్థితి ఇంకెన్నాళ్లు? తమ ఇంట పుట్టిన ఆడపిల్ల పెళ్లి చేయాలంటే వేరే ప్రాంతానికి వెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. దీనికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. అంతే వరుడి కోసం వంతెన కట్టేశారు.

గ్రామానికి చెందిన బతేష్ తన కుమార్తె రాఖీ కుమారిని ఫోర్బెస్గంజ్ బ్లాక్ లోని రామాయి గ్రామానికి చెందిన అమరేంద్రకు ఇచ్చి వివాహం చేయనున్నాడు. పెళ్లి తేదీ వరకు అన్ని పనులు ఉత్సాహంగా చేశారు. కాని వధువు తరపువారికి ఓ అసంతృప్తి మిగిలిపోయింది. వరుడిని అతడి బంధుమిత్రులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ గ్రామానికి తీసుకురావడం. తమ ఇంటిలోనే తమ ఆడబిడ్డకు వివాహం చేయాలి. దీంతో గ్రామంలో పెద్దలంతా కూర్చుని చర్చించారు. వెదురు వంతెన నిర్మిస్తే బెస్ట్ అని నిర్ణయించారు. అతే..అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రే వంతెన కట్టేశారు.

వంతెన కాంక్రీటు వంతెనంత స్ట్రాంగ్ గా లేకపోయినా..ఊరేగింపుగా వరుడిని తీసుకొచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా కట్టారు. దీంతో పెళ్లి కొడుకుని బైక్ మీద ఎక్కించుకుని వంతెనను దాటించి ఇంటికి తీసుకువచ్చారు. వరుడితో పాటు, అతడి బంధుమిత్రులు కూడా వెదురు వంతెనపై చక్కగా వచ్చి పెళ్లి చేసుకుని కోడలిని అత్తారింటికి తీసుకెళ్లారు. ఈ పెళ్లికి గతంలో లాగా కాదు చాలామంది బంధువులు వచ్చారు. దీంతో హుషారుగా ధూమ్ ధామ్ గా పెళ్లి చేసి ఆడబిడ్డను అత్తారింటికి పంపించారు. అదీ వరుడి కోసం వంతెన కట్టిన గ్రామస్తులు చేసిన పని. కలిసి ఉంటే కలదు సుఖం అని నిరూపించారు గ్రామస్తులంతా కలిసి.

దేశం అభివృద్ది చెందుతోందని పాలకులు చెబుతున్నా..ఇంకా లెక్కలేనన్ని ప్రాంతాల్లో ప్రజలు వాగులు..కాలువలు..ఆఖరికి నదులు దాటాలంటే ప్రాణాలు పణ్ణంగా పెట్టాల్సిందే. అటువంటిదే బీహార్‌లోని అరరియాలోని ఫుల్సర గ్రామం. ఈ ఊరిలో ఏదన్నా శుభాకార్యాలు జరిగినా బంధువులు..స్నేహితులు పెద్దగా రారు.కారణం ఆ ఊరు వెళ్లాలంటే పెద్ద కాలువ దాటి వెళ్లాలి. కానీ గ్రామస్తుల సమిష్టి కృషితో తాత్కలికంగా అయినా తమ సమస్య పరిష్కరించుకున్నారు.