Bharat Jodo Yatra: తెల్లటి దుస్తులు, కంటైనర్లలోనే బస.. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’లో ఆసక్తికర విషయాలు ..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టే ‘భారత్ జోడో యాత్ర’ ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ తెల్లటి దుస్తుల్లో పాల్గొంటారు. రాత్రి సమయాల్లో కంటైనర్లలోనే బస చేయనున్నారు.

Bharat Jodo Yatra: తెల్లటి దుస్తులు, కంటైనర్లలోనే బస.. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’లో ఆసక్తికర విషయాలు ..

Bharat Jodo Yatra 7th day

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టే ‘భారత్ జోడో యాత్ర’ ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సాయంత్రం ప్రారంభమవుతుంది. అయితే గురువారం ఉదయం 7గంటల నుంచి రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ శ్రీనగర్ వరకు 3570 కి.మీ. వరకు 12 రాష్ట్రాల మీదుగా 150 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ప్రతీరోజూ 22 నుంచి 23 కిలో మీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది.పాదయాత్రలో భాగంగా స్థానిక ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం, ప్రభుత్వం పేదల పట్ల మోపుతున్న భారాలను వారికి వివరించడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర సాగుతుంది. ఒక అడుగు మీది.. ఒక అడుగు నాది.. కలిసి ముందుకు సాగుదాం.. ఒకే నినాదం ఇద్దామంటూ భారత్ జోడో యాత్ర సాగనుంది. ఈ పాదయాత్రలో రాహుల్ వెంట 118 మంది నేతలు నడుస్తారు. 118 మందిని గ్రూపులు వారీగా విభజించి ఒక్కో గ్రూపులో 50 మంది ఉండేలా రాహుల్ తో పాటు నిత్యం ఒక గ్రూపు సభ్యులు నడిచేలా ఏర్పాట్లు చేయనున్నారు.

Bharat Jodo Yatra: నేటి నుంచి ప్రారంభంకానున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. ఈ రోజు షెడ్యూల్ ఇలా..

‘భారత్ జోడో యాత్ర’ విశేషాలు..

– రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో చేపట్టే భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమై 150 రోజుల్లో 3,570 కి.మీలు ప్రయాణించి జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది.

– యాత్రికులు ఏ హోటల్‌లోనూ బస చేయరు. రాత్రుళ్లు కంటైనర్‌లలో బస చేస్తారు. ఇందుకోసం మొత్తం 60 కంటైనర్లను ఏర్పాటు చేశారు. కొన్ని కంటైనర్లలో స్లీపింగ్ బెడ్లు, టాయిలెట్లు, ఏసీలు కూడా అమర్చారు.

– భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఒక కంటైనర్‌లో ఉంటారు. ఇతరులు మిగిలిన కంటైనర్‌లలో బస చేస్తారు.

– కంటైనర్ ప్రతిరోజు ఒక గ్రామంలో కొత్త ప్రదేశంలో పార్క్ చేయబడుతుంది. పూర్తి సమయం యాత్రికులు రోడ్డుపైనే భోజనం చేస్తారు.

– భారత్ జోడో యాత్ర సాగే ఐదు నెలల్లో వాతావరణంలో వచ్చే మార్పును దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశారు.

– యాత్రలో పాల్గొనేవారు ప్రతిరోజూ 6 నుండి 7 గంటల పాటు నడుస్తారు. యాత్రికులు రెండు బ్యాచ్‌లు ఉంటారు. ఉదయం, సాయంత్రం వారు రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొంటారు.

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

– భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట పాల్గొనే ఉదయం బ్యాచ్ 7గంటల నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం బ్యాచ్ మధ్యాహ్నం 3.30 నుంచి 6.30 గంటల వరకు యాత్రలో పాల్గొంటారు. రోజూ 22 నుంచి 23 కిలోమీటర్లు నడవాలనేది ప్రణాళిక.

– భారత్ జోడో యాత్రలో పాల్గొనేవారిలో అత్యంత వయస్సు కలిగిన వారిలో రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత విజేంద్ర సింగ్ మహల్వత్(58), అతి పిన్న వయస్కులు అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 25ఏళ్ల అజం జోంబ్లా, బెం బాయి. రాహుల్ గాంధీ యాత్ర బృందంలో కన్హయ్య కుమార్, పవన్ ఖేరా కూడా ఉన్నారు. యాత్రికుల్లో దాదాపు 30% మంది మహిళలు పాల్గొంటారు.

– రూట్ మ్యాప్ ప్రకారం.. కన్యాకుమారి, తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్ జామోద్, ఇండోర్, కోట, దౌసా, అల్వార్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్, జమ్మూ, శ్రీనగర్. ఇలా ఈ 20 కీలక ప్రదేశాలలో భారత్ జోడో యాత్ర సాగనుంది.

– భారత్ జోడో యాత్ర కేరళ రాష్ట్రంలో 18 రోజులు, కర్ణాటక రాష్ట్రంలో  21 రోజులు సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగినప్పుడు యాత్ర కర్ణాటకలో సాగుతుంది.