జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌లను ఇండియా మ్యాప్‌ నుంచి వేరు చేసిన WHO

జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌లను ఇండియా మ్యాప్‌ నుంచి వేరు చేసిన WHO

WHO’s colour-coded country map : ప్రపంచ ఆరోగ్య సంస్థ కశ్మీర్ విషయంలో పెద్ద తప్పును చేసింది. కరోనా మ్యాప్‌ను చూపించే క్రమంలో W.H.O జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌లను ఇండియా మ్యాప్‌ నుంచి వేరు చేసింది. ఇప్పటికే కరోనా విషయంలో అనేక దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న W.H.O.. దాని ప్రభావంతో ఇప్పుడు భారతీయుల ఆగ్రహానికి గురౌతుంది. ట్రంప్‌ ఆరోపణలకు ఊతమిస్తూ.. చైనాతో అంటకాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కరోనా విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలకు W.H.O కలర్ కోడింగ్ ఇచ్చింది. అందులో ఇండియాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నీలి రంగును కేటాయించింది. అయితే, అందులో జమ్ము కశ్మీర్‌ను మాత్రం నీలిరంగులో చూపించలేదు. జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌లను బూడిద రంగులో చూపించింది. అంతటితో ఆగని W.H.O ఇండియా, చైనా వివాదాస్పద సరిహద్దు అయిన అక్సాయ్‌ చిన్‌ను కూడా చైనాలో కలిపేసింది. ఇలా చైనాకు కేటాయించిన కలర్ కోడింగ్‌లో కశ్మీర్‌ ప్రాంతాలను కలపడంతో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం W.H.O చర్యలను చూస్తుంటే.. అది చైనాకు అనుబంధ సంస్థగా మారిపోయిందనే విమర్శలు నిజమే అనే భావన కలుగుతోందంటున్నారు. కోవిడ్ -19తో అమోఘంగా పోరాడిన భారత్ వంటి దేశంతో W.H.O వ్యవహరిస్తున్న తీరుపై పలు సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇండియాను ఇబ్బంది పెట్టేందుకే చైనా.. W.H.Oతో కలిసి ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయ్‌. ఇప్పటికే.. జమ్ము కశ్మీర్‌ మ్యాప్‌ విషయంలో.. పాకిస్తాన్, నేపాల్‌లతో ఇండియాకు గొడవలు జరిగాయి.