అమర జవాన్ భార్య శపథం : నేను సైన్యంలో చేరుతున్నాను..

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు మనుగడ కష్టంగా ఉంటుంది. అమర జవాన్ల భార్యలకు తమ పిల్లలను పోషించడం భారంగా ఉంటుంది.

  • Published By: sreehari ,Published On : February 25, 2019 / 09:47 AM IST
అమర జవాన్ భార్య శపథం : నేను సైన్యంలో చేరుతున్నాను..

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు మనుగడ కష్టంగా ఉంటుంది. అమర జవాన్ల భార్యలకు తమ పిల్లలను పోషించడం భారంగా ఉంటుంది.

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు మనుగడ కష్టంగా ఉంటుంది. అమర జవాన్ల భార్యలకు తమ పిల్లలను పోషించడం భారంగా ఉంటుంది. వచ్చే కొంత పెన్షన్ తో కుటుంబాన్ని నెట్టుకరావాలంటే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. 2017లో ఇండో-చైనా, టవాంగ్ సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముంబైకి చెందిన ఆర్మీ మేజర్ ప్రసాద్ మహదీక్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మేజర్ ప్రసాద్ భార్య గౌరి మహదిక్ (32) తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. బాధనంత దిగమింగింది. ఒంటరిగా జీవనం సాగించడం ఇష్టంలేక తన భర్తలా తాను కూడా ఆర్మీలో జాయిన్ కావాలని ఆమె డిసైడ్ అయింది.
Read Also: అక్కడ ఏం జరిగింది : శ్రీధరణిని చంపింది ప్రియుడేనా!

ఆర్మీలో చేరుతున్నానంటూ అమర జవాను భార్య గౌరీ శపథం చేసింది. ఆర్మీలో ఎలాగైనా చేరాలనే లక్ష్యంతో.. 2018లో  ఎస్ఎస్ బీ (సర్వీసు సెలెక్షన్ బోర్డ్) పరీక్ష రాసింది. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన గౌరీ ప్రసాద్.. 16 మంది టాపర్లలో ఒకరిగా నిలిచింది. చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో 49 వారాలపాటు ఇచ్చే ట్రైనింగ్ పూర్తి అయ్యాక మార్చి 2020లో ఆర్మీలో లెఫ్టినెంట్ గా జాయిన్ కానున్నట్టు గౌరీ ప్రసాద్ తెలిపింది. ఇదే తన భర్తకు ఇచ్చే గొప్ప నివాళిగా పేర్కొంది. 

నాన్ టెక్నికల్ కేటగిరిలో వార్ విడోస్ లకు ఇచ్చే లెఫ్టెనెంట్ పోస్టులో జాయిన్ కానుంది. ఆర్మీలో జాయిన్ కావాలని గౌరీ ప్రసాద్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తూ.. సెల్యూట్ అంటున్నారు.
Read Also: కొత్త చట్టం ఎఫెక్ట్ : మళ్లీ నోట్ల కష్టాలు రాబోతున్నాయా.. ATMలు ఖాళీనా!