New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!

నూతన కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగుల జీతం, పని గంటలు, పన్నులు తదితర అంశాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉద్యోగుల రోజువారీ పని గంటల్ని పెంచాలని, వారానికి సెలవు దినాల్నీ ఎక్కువ చేయాలని కొత్త వేతన చట్టంలో ప్రతిపాదించారు.

New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!

Labour Laws

new labour laws : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న కార్మిక చట్టాల అమలు జూలై నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఇందుకు ఇంకా అంగీకరించాల్సివుంది. నూతన కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగుల జీతం, పని గంటలు, పన్నులు తదితర అంశాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉద్యోగుల రోజువారీ పని గంటల్ని పెంచాలని, వారానికి సెలవు దినాల్నీ ఎక్కువ చేయాలని కొత్త వేతన చట్టంలో ప్రతిపాదించారు. అంతేకాకుండా స్థూల వేతనంలో 50శాతం బేసిక్‌ ఉండాలని ఉద్దేశించారు. దీంతో ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతాలకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా మీరు పొందే నెలసరి వేతనం తగ్గవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) పెరగవచ్చు. విజృంభించిన రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏను సర్కారు సవరించే వీలున్నట్టు చెబుతున్నారు. ఏటా జనవరి, జూలైల్లో ప్రభుత్వం డీఏను ప్రకటిస్తుంది. అమ్మకాలను పెంచుకోవడం కోసం చేసే వ్యాపారం నుంచి పొందే ప్రయోజనాలకూ టీడీఎస్‌ వర్తించనుంది. ఉదాహరణకు సోషల్‌ మీడియా ప్రభావశీలురకు వచ్చే ఉచిత విమాన లేదా ఐపీఎల్‌ టిక్కెట్లు, డాక్టర్లు అందుకునే శాంపిల్‌ మెడిసిన్స్‌కూ పన్నుపోటు తప్పదు. జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల టోకెనైజేషన్‌, కో-బ్రాండింగ్‌ నిబంధనలను మూడు నెలలపాటు ఆర్బీఐ వాయిదా వేసింది.

Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ

కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే కంపెనీలు వారానికి 4 రోజులు మాత్రమే ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకునే వీలు క‌లుగుతుంది. అయితే వారానికి మొత్తం ప‌ని గంట‌లు మాత్రం 48గానే ఉండ‌నున్నాయి. ఈ లెక్క‌న ఒక‌వేళ కంపెనీలు నాలుగు రోజులు ప‌ని, మూడు రోజులు పెయిడ్ లీవ్స్ ఇవ్వాల‌ని అనుకుంటే..ఆ నాలుగు రోజుల్లో రోజుకు 12 గంట‌ల పాటు ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఉద్యోగుల అనుమ‌తితోనే అని కేంద్ర కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి అపూర్వ చంద్ర తెలిపారు.

వారానికి ఎన్ని రోజులు ప‌ని అన్న విష‌యంలో తాము ఎవ‌రినీ ఒత్తిడి చేయ‌డం లేద‌ని అపూర్వ చంద్ర చెప్పారు. కంపెనీలకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం రెండు ఆప్షన్లు అందిస్తుందని.. వారంలో నాలుగు రోజులు (రోజుకు 12 గంటలు) పని చేయాలా? లేదంటే వారంలో ఐదు రోజులు లేదా ఆరు రోజులు పని చేయాలా? అనేది పూర్తిగా ఉద్యోగులు, కంపెనీల ఇష్టమని తెలిపారు. కంపెనీలు, ఉద్యోగులు కచ్చితంగా ఒక ఆప్షన్ ఎంచుకోవలసి ఉంటుందని..వారు ఏ ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చని తెలిపారు.

వారానికి 4 రోజులే పని..కొత్త లేబర్ కోడ్ తీసుకురానున్న కేంద్రం

కొత్త రూల్ అమలులోకి వచ్చిన తర్వాత కంపెనీలు 4 రోజుల, 5 రోజుల,6 రోజుల పని దినాల కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు . ఈ కొత్త కోడ్ వ‌ల్ల కంపెనీలు, ఉద్యోగుల‌కు ప‌ని చేసే రోజుల్లో కాస్త వెసులుబాటు క‌లుగుతుంద‌ని అపూర్వ చంద్ర చెప్పారు. ఈ కొత్త కోడ్ ముసాయిదా నిబంధ‌న‌లు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని, చాలా వ‌రకూ రాష్ట్రాలు కూడా త‌మ సొంత నిబంధ‌న‌లు రూపొందించే ప్ర‌క్రియ‌లో ఉన్నాయ‌ని తెలిపారు. అంతేకాకుండా ఉచిత మెడికల్ చెకప్స్ కూడా ఈ కొత్త లేబర్ కోడ్ లో ఉంటాయి.

ఇక ఈ ఏడాది జూన్ నాటికి అసంఘ‌టిత రంగ కార్మికులు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డానికి, ఇత‌ర ప్ర‌యోజ‌నాల కోసం ఓ వెబ్ పోర్ట‌ల్ ప్రారంభించనుంది కార్మిక మంత్రిత్వ శాఖ. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వేత‌న కోడ్‌, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిప‌ర‌మైన భ‌ద్ర‌త‌, ఆరోగ్య‌, ప‌ని ప‌రిస్థితులు, సామాజిక భద్ర‌త కోడ్‌ల‌ను తీసుకురానుంద‌ని అపూర్వ చంద్ర తెలిపారు.