COVID-19 Vaccinations: నయా రికార్డ్.. ఒక్కరోజులో 16లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం అవ్వగా.. సోమవారం(21 జూన్ 2021) ఒక కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. రాత్రి 7 గంటల వరకు మొత్తం 83లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

COVID-19 Vaccinations: నయా రికార్డ్.. ఒక్కరోజులో 16లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్

Vaccination

COVID-19 vaccinations: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం అవ్వగా.. సోమవారం(21 జూన్ 2021) ఒక కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. రాత్రి 7 గంటల వరకు మొత్తం 83లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

జూన్ 21వ తేదీన ఒక్కరోజే దేశంలో ప్రవేశపెట్టిన వ్యాక్సిన్ల జాబితాలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. నివేదిక ప్రకారం, మధ్యప్రదేశ్‌లో మహాబియాన్ కింద మొదటి రోజు సుమారు 16 లక్షల వ్యాక్సిన్లను వేశారు.

జూన్ 21 వ తేదీ నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన యువ‌త‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించగా.. ఓ నివేదిక ప్రకారం రాష్ట్రంలో సోమవారం 16,73,858 వ్యాక్సిన్ మోతాదులను వేశారు. 8 జిల్లాల్లో విస్తరించిన రాజధాని భోపాల్‌లో మొత్తం 3,75,962 వ్యాక్సిన్ మోతాదులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం వేసినట్లు ప్రకటనలో తెలిపింది.

బేతుల్, భోపాల్, హర్దా, హోషంగాబాద్, రైసన్, రాజ్‌ఘర్, సెహోర్ మరియు విదిషా ఇందులో ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ‘టీకా మహా అభియాన్’ ప్రారంభించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.

అదే సమయంలో 8 జిల్లాలు ఉన్న ఇండోర్‌లో 3లక్షల 88వేల 401 మోతాదులను.. గ్వాలియర్‌లోని 8 జిల్లాల్లో లక్షా 93వేల 435 మోతాదులను వేశారు. జబల్పూర్‌లోని 8 జిల్లాల్లో 2,07,160 మోతాదులను ఇచ్చారు. ఉజ్జయినిలో 2,54,757 మోతాదులు ఇవ్వబడ్డాయి.