క్వారంటైన్‌లో లేకపోతే ఒక్క కరోనా పేషెంట్ 400మందికి అంటిస్తాడు!!

క్వారంటైన్‌లో లేకపోతే ఒక్క కరోనా పేషెంట్ 400మందికి అంటిస్తాడు!!

హాస్పిటల్ లో చేరిన వాళ్లలో దాదాపు 70శాతం మందికి కరోనా కన్ఫామ్ అవుతుంది. చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తున్నా కరోనా అయి ఉండొచ్చని గుర్తు చేస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట నిజమవుతోంది. కేంద్ర మంత్రి లా అగర్వాల్ ఐసీఎమ్మార్ తెలిసిన ఇటీవల స్టడీలో వివరాలిలా ఉన్నాయని చెప్పాడు. నియమాలను ఉల్లంఘించి సొసైటీలో తిరిగితే ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి ఒక్కడు 30రోజుల్లో దాదాపు 406మందికి వైరస్ అంటిస్తాడు. 

కొవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రం నుంచి రిక్వెస్ట్ లు వస్తున్నాయి. పరిస్థితిని బట్టి కేంద్రం అదే నిర్ణయం తీసుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికే లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించినా.. క్వారంటైన్ నుంచి తప్పుకుంటే  చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. 

అప్పటి నుంచి సోషల్ డిస్టన్స్ పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని తగ్గిస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ కు పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం 3వేల బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా కావాలంటే మరో 8వేల బెడ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. (కరోనా భయంతో కన్న తల్లి శవాన్ని కూడా కాదన్నారు!!)

దేశవ్యాప్తంగా 4వేల 200కేసులు నమోదయ్యాయి. కేజ్రీవాల్.. లక్ష మందికి మాస్ టెస్టింగులు నిర్వహిస్తామని టెస్టింగ్ కిట్లు కూడా రెడీ అయ్యాయని అన్నారు.