Wife And Husband: భర్తతో గొడవపడి అర్థరాత్రి 90 కిలోమీటర్లు నడిచిన భార్య

భర్తతో గొడవపడి ఓ మహిళ తన కుమారుడిని తీసుకోని ఇంట్లోంచి బయటకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో కాలినడకనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోదరి ఇంటికి బయలుదేరింది.

Wife And Husband: భర్తతో గొడవపడి అర్థరాత్రి 90 కిలోమీటర్లు నడిచిన భార్య

Wife And Husband

Wife And Husband: భర్తతో గొడవపడి ఓ మహిళ తన కుమారుడిని తీసుకోని ఇంట్లోంచి బయటకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో కాలినడకనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోదరి ఇంటికి బయలుదేరింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా గాడికొప్పకు చెందిన నాగరత్న భర్తతో గొడవ పడింది. భర్తతో ఉండడం ఇష్టం లేక కొడుకును తీసుకోని ఇంట్లోంచి బయటకు వచ్చింది.

విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా తుంబిగెరెలోని సోదరి నివాసానికి వెళ్లేందుకు శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరింది. రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన బయలుదేరింది. శనివారం రాత్రికి వేళకు ఆమె దావణగెరెకు చేరుకుంది. రాత్రి వేళ ఒంటరిగా వెళ్తున్న మహిళను ఆపి పోలీసులు ప్రశ్నించారు. తన భర్తతో గొడవపడి కొడుకుని తీసుకోని సోదరి ఇంటికి వెళ్తున్నట్లు పోలీసులకు తెలిపింది.

అప్పటికే ఆమె 90 కిలోమీటర్లు నడిచిందని, మరో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సోదరి ఇంటికి వాహనంలో తీసుకెళ్లామని దావణగెరె పోలీసులు తెలిపారు. అయితే ఆమె చేతిలో డబ్బుకూడా లేకపోవడంతో భోజనం కూడా చేయలేకపోయిందని పోలీసులు వివరించారు. తామే భోజనం ఏర్పాటు చేసి తిన్న తర్వాత ఆమెను సురక్షితంగా సోదరి ఇంట్లో దించామని తెలిపారు.