Madhumita pandey : 100 రేపిస్టుల్ని ఇంటర్వ్యూ చేసిన మహిళా జర్నలిస్టు..వారినుంచి ఏం తెలుసుకున్నారు?

100 మంది రేపిస్టులను ఇంటర్వ్యూ చేసిన మహిళా జర్నలిస్టు. రేపిస్టుల్ని ఇంటర్వ్యూల చేసిన తరువాత వారిపై తన అభిప్రాయం మారింది అంటున్నా ఆమె ఏం తెలుసకున్నారు?

Madhumita pandey : 100 రేపిస్టుల్ని ఇంటర్వ్యూ చేసిన మహిళా జర్నలిస్టు..వారినుంచి ఏం తెలుసుకున్నారు?

Women Journalist Interviewed 100 Convicted Rapists In India

Women journalist interviewed 100 convicted rapists in india  : రేపిస్టు.అనే మాట ఎంత భయంకరమైనదో..ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. చిన్నపాటి నేరం చేసి జైలుకెళ్లినవారి దగ్గరకు వెళ్లాలంటే భయపడిపోతారు. అటువంటిది కరడు కట్టిన రేపిస్టుల వద్దకు వెళ్లి వారిని ఇంటర్వ్యూ చేయటం..అంటే మాటలు కాదు. కానీ అటువంటి ధైర్యం ఆ మహిళా జర్నలిస్టు మధుమిత పాండే.అత్యాచార నేరంపై తీహార్‌ జైలుకు వెళ్లిన 100 మంది నేరస్థులను ఇంటర్వ్యూ చేశారు మధుమిత పాండే. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారి జీవిత గమనాన్ని అధ్యాయనం చేసి రీసెర్చ్‌ థీసిస్‌ డెవలప్‌ చేశారు మధుమితా పాండే. యూకేలోని అంగ్లియా రస్కిన్‌ యూనివర్సిటీ ఆమె పీహెచ్‌డీ చేసిన మధుమిత ఢిల్లీలో పుట్టి పెరిగారు.లండన్ లో మాస్టర్స్ చేసిన మధుమిత పాండే దేశ వ్యాప్తంగా పెను సంచలనం కలిగించి ఓ చట్టం రూపొందించినటానికి కారణమై ‘నిర్భయ రేప్‌’ ఘటనపై భారతీయుల్లో వచ్చిన స్పందన పాండేకు ఆసక్తిని కలిగించింది.

నిర్భయ చట్టం వచ్చాక కూడా దేశంలో అత్యాచార ఘటనలు ఆగనేలేదు. కానీ అత్యాచారాలపై పెద్ద ఎత్తున చర్చలు జరగటానికి కారణమైంది నిర్భయ రేప్ ఘటన. నిర్భయ రేప్ తరువాత కఠిన చట్టాలు అమల్లోకి వచ్చినా దేశంలో అత్యాచార ఘటనలు తగ్గకపోవడంపై పరిశోధన చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు మధుమితా పాండే. అనుకున్న వెంటనే ఢిల్లీలో తన పరిశోధన ప్రారంభించారు.

అత్యాచార కేసులో దోషులను భారత్‌లో ఎలా చూస్తారు? అనే ఆలోచన వచ్చింది. ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తు..తీహార్‌ జైల్లోని అత్యాచార దోషులను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేక అనుమతులు తీసుకున్నారు.అలా దాదాపు 100 మంది రేపిస్టులను కొన్ని వారాల పాటు ఇంటర్వ్యూ చేశారు మధుమిత పాండే. వాటి నుంచి తన డాక్టోరల్‌ థీసిస్‌ను డెవలప్‌ చేసుకున్నారు.ఈ ఇంటర్వ్యూల విషయం గురించి..ఆమె పలు కీలక విషయాలు తెలుసుకున్నారు.మరెన్నో అంశాల్ని గుర్తించారు. రేప్‌ కేసులో జైలుకు వెళ్లిన వారిలో అందరూ నిరక్షరాస్యులేనని గుర్తంచారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారని తెలుసుకున్నారు.

కానీ ఈ ఇంటర్వ్యూల తర్వాత భారతీయ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న రేపిస్టులపై తన అభిప్రాయం మారిందని ఆమె తెలిపారు. రేపిస్టుల్ని భయానక వ్యక్తులుగా చూడటం సరికాదని…సమస్యంతా వారు ‘ఎక్స్‌ట్రార్డినరీ మెన్‌’ కావడమేనని అన్నారు. జైళ్లలో ఉన్న అందరూ ‘ఆర్డినరీ’ వ్యక్తులని తాను తెలుసుకున్నానని మధుమిత తెలిపారు. వారికొచ్చిన ఆలోచనలను అదుపు చేసుకోలేక వారి ఆలోచనా విధానంలో మార్పు లేకపోవడమే వల్లే వాళ్లు రేపులు వంటి దారుణాలకు ఒడిగట్టినట్లు తనకు అర్థమైందని తెలిపారు.

భారత్‌లోని కుటుంబాల్లో అబ్బాయి ఎక్కువనీ, అమ్మాయి అంటే తక్కువనే దృష్టి ఉండటం కూడా రేప్‌లకు ఓ కారణమని మధుమిత అభిప్రాయపడ్డారు. జైల్లో ఉన్న రేపిస్టుల మాటలు వింటే.. వారు అనుభవిస్తున్న మానసిక క్షోభ ఎవరూ అనుభవించకూడదని అనుకుంటామని తెలిపారు. (కానీ కొన్ని రేప్ కేసుల్లో నిందుతులు దోషులుగా శిక్ష అనుభవిస్తున్నారు ఏమాత్రం పశ్చాత్తాపం పొందకపోవటం గమనించాలి).

తాను ఇంటర్వ్యూ చేసిన వారిలో కొంతమందికి అసలు ‘రేప్‌’ అనే పదానికి అర్థం ఏంటో తెలియదనే విషయాన్ని తెలిపారామె. భారత్ లో స్కూళ్లలో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ లేకపోవడం కూడా అత్యాచారాలకు ఓ కారణమని…’సెక్స్‌ ఎడ్యుకేషన్‌’ సబ్జెక్టును సిలబస్‌లో చేరిస్తే అది అత్యాచారాలు నియంత్రణకు ఉపయోగపడొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లల్ని పాడు చేస్తుందని, సంప్రదాయాలను దెబ్బతీస్తుందనే అపనమ్మకం మనకు నాటుకుపోయిందని అదే రాజకీయ నాయకుల్లో వేళ్లూనుకుని ఉందని అన్నారు. జననాంగాలు వంటి వాటిపై లైంగిక పరిజ్ఞానం కలిగించపోవడం కూడ ఓ కారణమనే అభిప్రాయాన్ని మధుమిత పాండే వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని రహస్యంగానే ఉంచడం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకొంటున్నాయని మధుమిత పాండే చెప్పారు.. ఈ కారణాలతోనే మగపిల్లలకు లైంగిక విజ్ఞానం ఎలా అందుతుందని ఆమె ప్రశ్నించారు.

అత్యాచార నేరగాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకైనా తెలుసా? ఏ పరిస్థితుల కారణంగా ఇలాంటి నేరాలకు వాళ్లు పాల్పడుతున్నారు? ఈ ప్రశ్నలే తనను పరిశోధనా పత్రం సబ్జెక్ట్‌గా తీసుకోవడానికి కారణమని మధుమిత పాండే చెప్పారు.అత్యాచారానికి పాల్పడిన నిందితులపై పుట్టి పెరిగిన వాతావరం ప్రభావం బాగా ఉంటుందని మధుమిత పాండే చెప్పారు.సమాజంలో ఇతరుల మాదిరిగానే వారు జీవనం సాగిస్తున్నారని ఆమె అన్నారు. పెరిగిన వాతావరణం, స్నేహితులు, ఇతరత్రా ప్రభావంతో నిందితులు అత్యాచారాలకు పాల్పడ్డారని మధుమిత అభిప్రాయపడ్డారు. రేప్ అంటే తెలియనివారు కూడా రేపిస్టులుగా మారారని ఇదంతా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలియకపోవటమేనన్నారు.శృంగారానికి మహిళ అంగీకారం అవసరమనే ఆలోచన లేని వాళ్లు కూడా రేపిస్టుల్లో ఉన్నారని తెలిపారు.

ఐదేళ్ళ బాలికపై రేప్, పెళ్ళికి రెఢీ అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురు, నలుగురు మాత్రమే పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వారున్నారని మధుమిత పాండే చెప్పారు. బాధితురాలినే తప్పుపట్టిన వాళ్లు కూడా ఉన్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ ఖైదీ…తాను బయటకు వెళ్లిన తర్వాత ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని మధుమతి తెలిపారు. అలా ఆమె చేసిన 100మంది రేపిస్టుల ఇంటర్వ్యూలో చాలా చాలా విషయాలు తెలుసుకున్నానని..రేపిస్టులు ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయం తెలిసిందని..ఈ ఇంటర్వ్యూల తరువాత రేపిస్టుల గురించి తన అభిప్రాయం మారిందని తెలిపారు.