ఎన్నికల ప్రచారంలో హీరోకు ముద్దు పెట్టిన మహిళ

  • Published By: vamsi ,Published On : May 9, 2019 / 01:08 PM IST
ఎన్నికల ప్రచారంలో హీరోకు ముద్దు పెట్టిన మహిళ

సెలబ్రిటీలపై సామాన్య ప్రజలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిని ఒక్కసారి చూస్తే చాలు అనుకునేవారే ఎక్కువగా ఉంటారు. బాలీవుడ్ ప్రముఖ హీరో సన్నీడియోల్‌‌కు కూడా అక్కడ ఎక్కువగా మహిళలే అభిమానులు ఉంటారు. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కుమారుడైన సన్నీడియోల్.. బీజేపీలో చేరి పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురుదాస్‌పూర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు సన్నీడియోల్.

ప్రచారంలో భాగంగా గురువారం(09 మే 2019) నాడు రోడ్ షో నిర్వహించారు సన్నీడియోల్. ఓ వ్యాన్‌పై కూర్చొని అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సన్నీడియోల్ వద్దకు ఓ మహిళ వచ్చేందుకు ఆరాటపడింది. దానిని గ్రహించిన సన్నీడియోల్.. ఆమెను వ్యాన్‌పైకి ఆహ్వానించారు. చేతిని అందించి పైకి రమ్మన్నారు. అయితే, వ్యాన్‌పైకి ఎక్కిన మహిళ కరచాలనం చేస్తూ సన్నీడియోల్ చెంపపై ముద్దు పెట్టింది.

దీంతో ఆయన ఒక్కసారిగా షాక్‌ అయిన సన్నీ డియోల్ చిరునవ్వుతో ప్రజలకు అభివాదం చేస్తూ ఆమెను జాగ్రత్తగా వ్యాన్ దించారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.