Diwali With Mi Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై రూ.75వేల వరకు డిస్కౌంట్.. షావోమీ అదిరిపోయే ఆఫర్లు

దీపావళి పండుగ వచ్చేస్తోంది. పండుగ సమయంలో కొత్త వస్తువులు కొనడం కామన్. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతాయి. దీన్ని క్యాష్ చేసుకు

Diwali With Mi Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై రూ.75వేల వరకు డిస్కౌంట్.. షావోమీ అదిరిపోయే ఆఫర్లు

Diwali With Mi Sale

Diwali With Mi Sale : దీపావళి పండుగ వచ్చేస్తోంది. పండుగ సమయంలో కొత్త వస్తువులు కొనడం కామన్. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో అమ్ముడవుతాయి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు పలు కంపెనీలు రెడీ అయ్యాయి. ఫెస్టివల్ పేరుతో ప్రత్యేక సేల్స్ ప్రారంభిస్తున్నాయి. కొనుగోలుదారులను అట్రాక్ట్ చేసేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నాయి.

తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ షావోమీ దీపావళిను పురస్కరించుకుని ‘సెలబ్రెట్‌ దీపావళి విత్‌ ఎమ్‌ఐ’ సేల్‌ను అనౌన్స్ చేసింది. ఈ సేల్‌కు సంబంధించిన డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలను తన ఇండియా వెబ్‌సైట్‌లో ఉంచింది. స్మార్ట్‌ఫోన్లు‌, స్మార్ట్‌టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఇచ్చింది.

Gold Taxes : బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? ఎన్ని రకాల పన్నులు ఉన్నాయి, ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి..

షావోమీ తన ఉత్పత్తులపై సుమారు రూ.5వేల నుంచి రూ.75వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. అంతేకాదు రివార్డ్ ఎంఐ ఇన్‌స్టంట్ కూపన్ల ద్వారా రూ.5వేల వరకు తగ్గింపును ప్రకటించింది. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు కొనుగోలుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ దీనికి అదనం. దీపావళి విత్‌ ఎమ్‌ఐ సేల్‌లో షావోమీ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎమ్‌ఐ బాక్స్ 4కే అలాగే దాని ఐవోటీ పరికరాల ధరపై తగ్గింపు ఉంటుంది.

Gold : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.100 కే గోల్డ్..!

ఈ సేల్‌లో పాల్గొనే కస్టమర్లకు సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 1 వరకు ప్రీబుకింగ్స్‌ చేసుకునే సౌకర్యాన్ని షావోమీ కల్పించింది. దీని ద్వారా కొనుగోలుదారులు సేల్ ప్రారంభం కాక ముందే తమ ఫేవరెట్ ప్రొడక్ట్ ని బుక్ చేసుకోవచ్చు. కాగా, దివాళి విత్ ఎంఐ సేల్ కి సంబంధించిన కచ్చితమైన తేదీలను షావోమీ ఇంకా షేర్ చెయ్యలేదు.

స్మార్ట్ ఫోన్లు..
* Redmi 9A 2GB RAM 32GB storage రిటైల్ ధర. Rs 6,799(అసలు ధర Rs 8,499)
* అతి తక్కువ ధరకు Mi 11X (ప్రస్తుత ధర Rs 33,999). డిస్కౌంట్ ధర ఇంకా రివీల్ చెయ్యలేదు.

స్మార్ట్ టీవీలు..
* 75-inch Mi QLED TV పై సుమారు Rs 75వేలు డిస్కౌంట్ (అసలు ధర Rs 1,99,999)
* 50-inch Mi TV 5X మోడల్ టీవీపై Rs 20వేలు డిస్కౌంట్(ధర Rs 39,999)
* 40-inch Mi TV 4A మోడల్ పై రూ.8వేలు డిస్కౌంట్
* 65-inch Redmi Smart TV ధర Rs 59వేల 999( డిస్కౌంట్ Rs 15వేలు)
* 55-inch Redmi Smart TV ధర Rs 40వేల 999( డిస్కౌంట్ Rs 14వేలు)
* 32-inch Redmi Smart TV ధర Rs 10వేల 500

ఇతర స్మార్ట్ ప్రొడక్ట్స్..
ఎంఐ స్మార్ట్ బ్యాండ్(రూ.వెయ్యి తగ్గింపు), ఎంఐ బాక్స్ ఫోర్ కే(రూ.2వేలు తగ్గింపు), ఎంఐ పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఎయిర్ కంప్రెసర్(రూ.1500 తగ్గింపు)
ఎంఐ రోబోట్ వ్యాకూమ్ మాప్ పీపై రూ.11వేల 250 డిస్కౌంట్.. సేల్ లో దీని ధర రూ.18వేల 749.