YouTube : 10లక్షలకు పైగా వీడియోలు తొలగింపు

అవును 10లక్షలకు పైగా ప్రమాదకర వీడియోలను యూట్యూబ్ తొలగించింది. డేంజరస్ కరోనావైరస్ తప్పుడు సమాచారం ఉన్న వీడియోలను తొలగించాము అని యూట్యూబ్ ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి

YouTube : 10లక్షలకు పైగా వీడియోలు తొలగింపు

Youtube

YouTube : అవును 10లక్షలకు పైగా ప్రమాదకర వీడియోలను యూట్యూబ్ తొలగించింది. డేంజరస్ కరోనావైరస్ తప్పుడు సమాచారం ఉన్న వీడియోలను తొలగించాము అని యూట్యూబ్ ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించినట్టు తెలిపింది.

2020 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు కొవిడ్-19 టాపిక్ మీద అప్ లోడ్ అయి, తప్పుడు సమాచారం ఉన్న 10లక్షలకు పైగా వీడియోలను తొలగించాము. ఫేక్ సమాచారం ఉన్న వీడియోలు, వ్యూస్ లేని వీడియోలు, యూట్యూబ్ రూల్స్ అతిక్రమించడం లాంటి కారణాలతో ప్రతి 3 నెలలకు కోటి వీడియోల వరకు డిలీట్ చేస్తామని సంస్థ వెల్లడించింది. అయితే ఈసారి తొలగించిన వీడియోల్లో కేవలం కరోనాకు సంబంధించినవే 10లక్షలు ఉండటం గమనార్హం.

కరోనావైరస్ మహమ్మారికి సంబంధించి యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి. అయితే అందులో చాలావరకు ఫేక్ సమాచారమే ఉంది. దాని వల్ల అనర్థాలు జరుగుతున్నాయని ప్రభుత్వాలు, రాజకీయ నాయకుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో యూట్యూబ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

కరోనావైరస్ మహమ్మారిపై లక్షల సంఖ్యలో వీడియోలు వచ్చాయి. అయితే అందులో ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. ఎవరికి తోచినట్టు వారు వీడియోలు అప్ లోడ్ చేశారు. ఈ వీడియోల్లో చాలావరకు తప్పుడు సమాచారమే ఉంది. ఆ కారణంగా జనాలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వాల నుంచి ఒత్తిడి రావడంతో యూట్యూబ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫేక్ సమాచారం ఉన్న వీడియోలను రిమూవ్ చేస్తోంది. తద్వారా కరోనాకు సంబంధించి నాణ్యమైన, ఉపయోగకరమైన సమాచారం మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది.