యువతిపై జొమాటో డెలివరీ బాయ్ పిడిగుద్దులు

యువతిపై జొమాటో డెలివరీ బాయ్ పిడిగుద్దులు

delivery boy assaults woman

Zomato : ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ జోరందుకుంటున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వాళ్లు, వర్క్ బిజీలో..ఇప్పుడు వంట ఏం చేస్తాం అని అనుకొనే వారు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటుంటారు. జొమాటో, స్విగ్గీ ఇందులో కీలకం. అయితే..సమయానికి రాకపోవడం, ఒకటి ఆర్డర్ ఇస్తే..మరొకటి తేవడం వంటి ఘటనలు చూస్తుంటాం. దీంతో వారు ఆర్డర్స్ ను క్యాన్సిల్ చేస్తుంటారు. ఫుడ్ ఆలస్యంగా తెచ్చినందుకు క్యాన్సిల్ చేసిన యువతిపై డెలివరీ బాయ్ దాడికి దిగాడు. రక్తం వచ్చేలా కొట్టాడు. దీనిపై సదరు యువతి..ఇన్ స్టా గ్రామ్ ద్వారా..వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. డెలివరీ బాయ్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…

తనపై జొమాటో డెలివరీ బాయ్ దాడికి పాల్పడ్డాడని Hitesha Chandranee యువతి వీడియోలో వెల్లడించింది. ముక్కుపై రక్తంతో వచ్చినప్పుడు వీడియో తీశారు. అనంతరం ట్రీట్ మెంట్ తీసుకున్న అనంతరం మరో వీడియో అప్ లోడ్ చేశారు. ముక్కుపై కొట్టడం వల్ల రక్తం వచ్చిందంటూ..ఏడుస్తూ తెలిపింది. మార్చి 09వ తేదీ మధ్యాహ్నం వర్క్ లో ఉండడం వల్ల 3.30 పీఎంకు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, కానీ..సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. అయితే సమయానికి ఆర్డర్ రాకపోవడంతో తాను కస్టమర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి..ఫ్రీగా ఇవ్వడం లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని కోరడం జరిగిందన్నారు. అంతలో వచ్చిన డెలివరీ బాయ్ కు ఇదే విషయం చెప్పినట్లు, ఈ సమయంలో తాను సగం మాత్రమే డోర్ తెరిచినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా తనతో అతను వాదకు దిగినట్లు, బలవంతంగా డోర్ తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడన్నారు. తీవ్ర ఆగ్రహంతో తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడని వాపోయింది. ఆర్డర్ తీసుకుని పారిపోయాడని వీడియోలో వెల్లడించింది. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలవాలని ఆమె కన్నీటితో నెటిజన్లను అభ్యర్థించారు. అనంతరం తాను ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నట్లు, ఆ సమయంలో తాను మాట్లాడ లేని సమయంలో ఉన్నట్లు వెల్లడించారు. సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో పోలీసులు సానుకూలంగా స్పందించినట్లు ఇందుకు బెంగళూరు, కర్నాటక పోలీసులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వీడియోను షేర్ చేసి ఇలాంటి పరిస్థితి మరొక్కరికి రాకుండా ఉండాలని రోదిస్తూ ఆ యువతి వెల్లడించింది.

 

View this post on Instagram

 

A post shared by HITESHA | Beauty Influencer (@hiteshachandranee)