Government pension : 12 ఏళ్లుగా ప్రేతాత్మకు పెన్షన్..!

12 ఏళ్లుగా ప్రభుత్వం ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ళ నుంచి జరుగుతోంది. ఇదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం అంటూ సెటైర్లు, విమర్శలు వస్తున్నాయి.

Government pension : 12 ఏళ్లుగా ప్రేతాత్మకు పెన్షన్..!

ap government

Andhra Pradesh : ఆంధప్రదేశ్ లో ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ళ క్రితం మరణించిన వ్యక్తికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తునే ఉంది. ఇదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం అంటూ సెటైర్లు, విమర్శలు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం చనిపోయిన వ్యక్తి పుత్రరత్నం చేసిన ఘనకార్యం అని బయటపడింది. 12 ఏళ్ల క్రితం అంటూ 2001లో తండ్రి చనిపోయినా అతని పేరు మీద వచ్చే పెన్షన్ డబ్బుల్ని నొక్కేస్తున్నాడో పుత్రరత్నం. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వస్తున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులోని క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో చనిపోయిన తండ్రి ఇంకా బతికున్నట్లు ప్రభుత్వాన్ని నమ్మించి 12 సంవత్సరాలుగా పింఛన్ దండుకుంటున్నాడు శౌరయ్య అనే వ్యక్తి. తండ్రి కిరీటి బతికే ఉన్నాడని 2011లో నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి పెన్షన్ అందుకుంటున్నాడు. చనిపోయేనాటికే కిరీటికి 70 ఏళ్లు.

 

2001లో చనిపోయిన తన తండ్రి స్థానంలో మరొక వ్యక్తిని చూపిస్తూ పెన్షన్ అందుకుంటున్నాడని కిరీటి చిన్నకొడుకు శౌరయ్య. దీని గురించి అదే గ్రామానికి చెందిన శౌరయ్య సమీప బంధువు పల్నాడు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేయటంతో ఈ నిర్వాకం బయటపడింది. అలా 12ఏళ్లుగా దాదాపు రూ. 4 లక్షల పెన్షన్ రూపంలో ప్రభుత్వ సొమ్మును కాజేసిన శౌరయ్యపై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు సమీప బంధువు.