Viral wedding : బాజా భజంత్రీలతో మైనా – చిలుకలమ్మల పెళ్లి.. ఘనంగా బరాత్‌

బాజా భజంత్రీలతో మైనా-చిలుకలమ్మల పెళ్లి..ఘనంగా స్నేహితులు, బంధువులు, గ్రామ పెద్దల సమక్షంలో పెళ్లి బరాత్‌ జరిగింది.

Viral wedding : బాజా భజంత్రీలతో మైనా – చిలుకలమ్మల పెళ్లి.. ఘనంగా బరాత్‌

pet parrot married to myna with Band Baaja Baraat

Viral wedding : కుక్కలు పెళ్లి..కప్పలకు పెళ్లి..ఇలా వింత వివాహాల గురించి విన్నాం. చూశాం. కానీ మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ క్యూట్..క్యూట్ మ్యారేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని కరేలీలో ఇద్దరు వ్యక్తులు రెండు పక్షులకు ఘనంగా సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిపించారు వాటి యజమానులు. వీరి పెళ్లి బారాత్ కూడా ఘనంగా జరిపారు. చిట్టి చిలకమ్మ..ముద్దుల మైనాల పెళ్లి సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కొడుతోంది. చిలకా గోరింక అంటారు కదా పెద్దలు..కానీ నిజానికి ఈ రెండు పక్షులు వేరు వేరు జాతులకు చెందినవి. కానీ కొన్ని చిలుకలు మాట్లాడతాయి. అలాగే కొన్ని మైనా గోరింకలు మాట్లాడతాయి. చిలుక పలుకులు అంటారుగా నిజంగానే చిలుక పలుకులు భలే ముచ్చటగా ఉంటాయి. అలాగే మైనాలు పలుకే పలుకులు కూడా భలే ముద్దు ముద్దుగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ చిలుకమ్మల పెళ్లి మాత్రం భలే ముద్దు ముద్దుగా జరిగింది.

మధ్యప్రదేశ్ పిపారియా ప్రాంతానికి చెందిన రామస్వరూప్ పరిహార్ అనే వ్యక్తి ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. దానికి మైనాగా పేరు పెట్టుకుని దాన్ని సొంత బిడ్డలా కంటికి రెప్పలా పెంచుకుంటున్నాడు. పిపారియా ప్రాంతానికే చెందిన బాదల్ లాల్ విశ్వకర్మ అనే వ్యక్తి ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. రామ స్వరూప్ కు,బాద్ లాల్ కు పరిచయం ఉంది. మాటల మధ్యలో వీరిద్దరు తమ తమ పక్షుల గురించి చెప్పుకునేవారు. ఈక్రమంలో మన రెండు పక్షులకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అని మాట్లాడుకున్నారు. అనుకోవటమే కాదు రెండు పక్షుల జాతకాలు చూసి మరీ పెళ్లి జరిపించాలనుకుని నిర్ణయించుకున్నారు.

సొంత బిడ్డల్లా పెంచుకునే ఈ పక్షుల పెళ్లి కూడా ఘనంగా చేయాలనుకున్నారు. దీంట్లో భాగంగా మైనా-చిలుకల వివాహానికి ముహూర్తం కూడా పెట్టారు. అలా ఆదివారం (ఫిబ్రవరి, 2023)స్నేహితులు, బంధువులతో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు, సమక్షంలో బాజా భజంత్రీలతో రెండు పక్షులకు ఘనంగా పెళ్లి చేసి బరాత్‌ కూడా ఘనంగా జరిపించారు.

నాలుగు చక్రాలు ఉన్న బుల్లిజీపుపై ఓ పంజరాన్ని ఏర్పాటు చేసి గ్రామ వీధుల్లో పక్షుల జంటను ఊరేగించారు. ఈ క్యూట్ మ్యారేజ్ చూడటానికి జనాలు భారీగా తరలివచ్చారు. భలే భలే చిలుకా గోరింకల పెళ్లి అని వినటమే కాదని చూడటం ఇదే మొదటిసారి అంటూ ఈ వింత..అందమైన వివాహాన్ని కళ్లారా చూశారు. చిలుకా గోరింకలను మనసారా ఆశీర్వదించారు. ఈ చిలుకా గోరింకల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.