Uttar Pradesh : పాముకాటుతో ఆసుపత్రిలో భార్య.. ఆ పామును వెదికి పట్టుకుని ఆస్పత్రికి వచ్చిన భర్త.. నోరెళ్లబెట్టిన డాక్టర్లు

పాము కరిచి భార్య ఆస్పత్రిలో ఉంటే ఆమె భర్త మాత్రం తన భార్యకు కాటు వేసిన పామును పట్టుకుని మరీ ఆస్పత్రికి వెళ్లాడు. ఆ పాముని డాక్టర్లకు చూపించి సార్ ఇదే నా భార్యను కాటువేసిన పాము అంటూ చూపించటంతో డాక్టర్లు షాక్ అయ్యారు..

Uttar Pradesh : పాముకాటుతో ఆసుపత్రిలో భార్య.. ఆ పామును వెదికి పట్టుకుని ఆస్పత్రికి వచ్చిన భర్త.. నోరెళ్లబెట్టిన డాక్టర్లు

Uttar Pradesh

Uttar Pradesh : ఏవయ్యో నీ భార్యను పాము కరిచింది ఆస్పత్రిలో చేర్పించాం అని ఇరుగు పొరుగువారు చెబితే ఏ భర్త అయినా పరుగు పరుగున ఆస్పత్రికి పరుగులు పెట్టి భార్య పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన పడతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలోని ఉమన్ అత్వా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్యను కాటు వేసిన పామును వెతికి పట్టుకుని ఆ పాముని సంచిలో వేసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. ఇదిగో సార్ నా భార్యను కాటు వేసిన పాము ఇదే అంటూ డాక్టర్లకు చూపించాడు. ఆ పాముని చూసిన డాక్టర్లు హడలిపోయారు..ఏందయ్యా..ఇది పామునే పట్టుకుని వచ్చావ్? అని అడిగారు. దానికి ఆ భర్త ఏం చెప్పాడంటే ఏ పాము కాటు వేసిందో తెలిస్తే కదా సార్..మీరు దానికి తగినట్లుగా వైద్యం చేస్తారు..అందుకే నా భార్యను కాటువేసిన పామునే తెచ్చానంటు చెప్పుకొచ్చాడు. అతని సమాధానం విన్న డాక్టర్లు నోరెళ్లబెట్టాడు. అతనికి భార్యమీద ఉన్న ప్రేమ అనుకోవాలా? లేదా తనను కాటువేస్తుందేమోనని భయంలేకుండా పామును పట్టుకున్న ధైర్యవంతుడు అనాలా? ఏమనాలో తెలియక డాక్టర్లు షాక్ లోనే ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఉమన్ అత్వా గ్రామానికి చెందిన నరేంద్ర-కుష్మా భార్యాభర్తలు. కుష్మా వంటి ఇంటిలో పనిచేసుకుంటుండగా ఇంట్లోకి పాము ఎలా వచ్చిందో గానీ ఆమెను కాటేసింది. దీంతో కుష్మ భయపడిపోయి పెద్ద పెద్దగా అరుస్తు కుప్పకూలిపోయింది. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పరుగు పరుగున వచ్చారు. పాము కరిచిందని ఆమె ఏడుస్తునే చెప్పింది. వారుకూడా భయపడ్డారు. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసిన రాగానే ఆస్పత్రికి తరలించారు.

అదే విషయాన్ని నరేంద్రకు చెప్పారు స్థానికులు నీ భార్యను పాము కాటు వేసింది అని. భార్యను పాము కాటు వేసిందని తెలియగానే నరేంద్ర ఆస్పత్రికి వెళ్లకుండా నేరుగా ఇంటికెళ్లి ఆ పరిసర ప్రాంతాల్లో వెతికి పామును పట్టుకుని సీసాలో వేసి దాన్ని సంచిలో వేసుకుని పట్టుకుని ఆస్పత్రికి వచ్చాడు. ఆ పామును డాక్టర్లకు చూపించాడు. ఈ పామే సార్ నా భార్యను కాటువేసింది అని చెప్పాడు. అది చూసిన డాక్టర్లు హడలిపోయారు. ఇదేంటయ్యా పాముని తీసుకొచ్చావ్? అని అడగ్గా ఏపాము కరిచిందో తెలిస్తేనే కదా సార్ మీరు దానికి తగిన వైద్యం చేస్తారు? అందుకే నా భార్యను కాటు వేసిన పామునే పట్టుకొచ్చా అంటూ చెప్పుకొచ్చాడు. అది విన్న డాక్టర్లు షాక్ అయ్యారు.

కానీ కుష్మాకు అప్పటికే వైద్యం చేశామని ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పటంతో నరేంద్ర ఈ పాముని పారేయంటారా? సార్ అంటూ మరోసారి డాక్టర్లకు షాకిచ్చాడు. అతనిది అమాయకత్వమో ఏమో అర్థం కాని డాక్టర్లు ఆ పామును అడవిలో వదిలిపెట్టేయవచ్చా బాబూ అంటు చెప్పారు. దాంతో ఆ పామును పట్టుకుని బయటకెళ్లిపోయాడు నరేంద్ర..