టీడీపీకి మరో షాక్ : మాజీ మంత్రి తమ్ముడు రాజీనామా

ఏపీలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు

  • Published By: veegamteam ,Published On : September 4, 2019 / 05:59 AM IST
టీడీపీకి మరో షాక్ : మాజీ మంత్రి తమ్ముడు రాజీనామా

ఏపీలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు

ఏపీలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు సన్యాసిపాత్రుడు టీడీపీకి రాజీనామా చేశారు. నర్సీపట్నంలో లోకేష్ పర్యటనలో ఉండగానే రాజీనామాతో షాక్ ఇచ్చారు. అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు లోకేష్ నర్సీపట్నం వెళ్లారు. ఇన్నాళ్లు టీడీపీకి విధేయుడిగా పని చేశానని సన్యాసిపాత్రుడు చెప్పారు. పార్టీలో కేడర్ ని పక్కన పెట్టి వ్యక్తిగతంగా నర్సీపట్నంలో వ్యవహారాలు జరిగాయని ఆయన ఆరోపిచారు. పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. దీని గురించి పార్టీ పెద్దలు, అధినాయకులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మార్గం లేకనే టీడీపీకి రాజీనామా చేశానని వివరించారు.

కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు సన్యాసిపాత్రుడు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా రాజీనామా చేశారు. న్యాసిపాత్రుడు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇందుకు సంబంధించి ఆ పార్టీ నేతలతో కొన్ని రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది పార్టీకి రాజీనామా చేసి వైసీపీ, బీజేపీలో చేరారు. మరికొందరు కూడా అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది.