Maharashtra: మహా గవర్నర్ అన్ని హద్దుల్ని దాటారు.. కోశ్యారిపై శరద్ పవార్ ఫైర్
మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్‌గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు ఆదర్శవంతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్నే తీసుకుంటే ఆయన పాత రోల్ మోడల్. బాబాసాహేబ్ అంబేద్కర్ నుంచి నితిన్ గడ్కరి వరకు ఎవరైనా కొత్త వ్యక్తుల్ని రోల్ మోడల్‌గా ఎంపిక చేసుకోండి

Governor crossed all limits said Sharad Pawar
Maharashtra: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ అన్ని హద్దుల్ని దాటారంటూ గురువారం మీడియా సమావేశంలో ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై కోశ్యారి చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలుగజేసుకునేలా కోరతానని పవార్ అన్నారు.
‘‘గవర్నర్ కోశ్యారి అన్ని హద్దుల్ని దాటి పోయి ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ విషయంలో కలుగజేసుకోవాలి. అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి మాటలు, ప్రవర్తన ప్రజల్లో చెడు సంకేతాలను పెంపొందిస్తాయి. అలాంటి వ్యక్తులు ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడాన్ని నిలువరించాలి’’ అని మీడియా సమావేశంలో పవార్ అన్నారు.
ఈ విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాజ్యసభ ఎంపీ ఉదయంరాజె బోంస్లే లేఖ రాశారు. మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీపై గవర్నర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
నంబర్ 19న ఔరంగాబాద్‌లోని బాబాసాహేబ్ అంబేద్కర్ మరట్వాడ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ కోశ్యారీ మాట్లాడుతూ ‘‘మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్‌గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు ఆదర్శవంతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్నే తీసుకుంటే ఆయన పాత రోల్ మోడల్. బాబాసాహేబ్ అంబేద్కర్ నుంచి నితిన్ గడ్కరి వరకు ఎవరైనా కొత్త వ్యక్తుల్ని రోల్ మోడల్‌గా ఎంపిక చేసుకోండి’’ అని అన్నారు.
గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలతో మహారాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఈ విషయమై శివసేన ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గవర్నర్ కోశ్యారీని తొలగించాలంటూ డిమాండ్ చేస్తోంది. అలాగే ముఖ్యమంత్రి షిండే సైతం రాజీనామా చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది.
BMC Polls: ఉద్ధవ్ థాకరేకు మద్దతుగా ముంబైలో ఎన్నికల ప్రచారం చేయనున్న తేజశ్వీ యాదవ్